కారు బీభత్సం.. ఇద్దరు వ్యక్తులు మృతి

 

ఈ మధ్య కారు నడిపే డ్రైవర్లు నేల మీద కార్లు నడుపుతున్నట్టు కనిపించడంలేదు. గతంలో దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఓ కారు రోడ్డు మీద వెళుతున్న జనాలమీదకే దూసుకెళ్లింది. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకుంది ఢిల్లీలో. ఢిల్లీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఢిల్లీలో జానకిపురి ప్రాంతంలో ఉన్నట్టుండి ఓ కారు పాదాచారులపైకి దూసుకొచ్చింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.