ప్రభుత్వానిది పంతం..మాది పట్టుదల.. సమ్మె విడువం :- ఆర్టీసీ జేఏసీ

 

పంతం.. పట్టుదల..తో ఆర్టీసీ కార్మికుల సమ్మె 47 వ రోజుకు చేరింది. ఒక వైపు వరుస చర్చలు.. మరోవైపు ఆందోళనలు.. ఇంకో వైపు కోర్టు వాదనలు ఎన్ని జరుగుతున్న సమ్మెకు మాత్రం ఫుల్ స్టాప్ పడటం లేదు. ఈ క్రమంలోనే ఇవాళ ( నవంబర్ 20న ) మరోసారి రాజకీయ పార్టీలతో  భేటీకానుంది ఆర్టీసీ జేఏసీ. సమ్మెపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో  ఏ నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం పంతం వీడటం లేదు.. కార్మిక నేతలు పట్టుదల వదలడంలేదు.. నిర్విరామంగా కొనసాగుతున్న సమ్మెను కొనసాగించాలా వద్దా అనే దానిపై అశ్వత్థామరెడ్డి సారధ్యంలో టీఎంయూ కార్మికుల సమావేశం.

రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఈయూ సిబ్బంది భేటీలు విడివిడిగా జరిగాయి. అయితే తుది నిర్ణయం కోసం జరుగుతున్న చర్చల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాజిరెడ్డి వర్గం సమ్మె కొనసాగించాల్సిందే అని నినాదాలు చేసింది. మొత్తంగా డిపోల వారీగా అభిప్రాయాలు సేకరించే పనిలో పడ్డారు జేఏసీ నాయకులు. ఉన్నపళంగా సమ్మె విరమిస్తే ఉద్యోగ భద్రత మాటేంటని ప్రశ్నిస్తున్నారు కొందరు కార్మికులు. సమ్మె విరమించిన ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంటుందా లేదా అన్న అనుమానం ఉండడంతో వేచి చూడాలని చెబుతున్నారు. మ్యాటర్ లేబర్ కోర్టుకు వెళ్లింది కాబట్టి ఆ నిర్ణయం వచ్చే వరకు వేచి చూద్దామంటున్నారు. రకరకాల అభిప్రాయాలున్న నేపథ్యంలో ఏం చేద్దామన్నా దానిపై జేఏసీ నేతలంతా ఒకసారి భేటీయ్యారు. మొత్తంగా సమ్మె ఆగాలా సాగాలా అన్న దానిపై ఇవ్వాల నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని జేఏసీ మీటింగ్ తర్వాత చెప్పారు అశ్వత్థామరెడ్డి.