దావూద్ ఇబ్రహీం లొంగిపోతానన్నాడు

 

అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఫస్ట్ ఉన్న దావూద్ ఇబ్రహీం గురించి ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ సంచలన విషయాలను బయట పెట్టారు. ముంబై వరుస పేలుళ్లు జరగడానికి ప్రధాన కారణమైన దావూద్, పేలుళ్లు జరిగిన 15 నెలల తరువాత తానే స్వయంగా లొంగిపోతానని రాయబారం పంపిచాడని నీరజ్ తెలిపారు. అప్పట్లో సీబీఐ, డీఐజీగా ఉన్న తనకు దావుద్ మూడుసార్లు ఫోన్ చేసి మాట్లాడాడని, భారత్ వస్తే ప్రత్యర్థులు తనని హతమారుస్తారన్న భయంతోనే దావుద్ లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇదే విషయాన్ని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలాని ద్వారా కూడా రాయబారం పంపించాడని, కానీ అతను లొంగిపోతానన్న ప్రతిపాదనని సీబీఐ అంగీకరించలేదని చెప్పారు.