పుస్తకాల బాటలో దగ్గుబాటి!

బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. కారంచేడులో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, పురందేశ్వరి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాజకీయాలు పూర్తిగా డబ్బుమయంగా మారిపోయాయని, కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచినా ప్రజల నుంచి చీత్కారాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయంగా ఇదే తన చివరి ప్రసంగమన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు శేష జీవితాన్ని  పుస్తకాలు రాస్తూ గడిపేస్తానన్నారు.