వైసిపి లీడర్స్ వార్నింగ్ ఇచ్చిన తరువాత అదృశ్యమైన ఓ గవర్నమెంట్ లెక్చరర్...

 

వైసీపీ నేతల బెదిరింపులతో గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఓ లెక్చరర్ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా పని చేస్తున్న సాంబశివరావు ఓ విద్యార్థిని మందలించారు. ఈ క్రమంలో విద్యార్థిపై చేయి చేసుకున్నారు, ఆ తర్వాత సాంబశివరావుపై పోలీసులకు ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత రెండు పక్షాల మధ్య పోలీసులు రాజీ కుదిర్చారు. ఈ ఘటన జరిగిన తర్వాత సాంబశివరావును కొందరు వైసీపీ నేతలు బెదిరించారు, దౌర్జన్యానికి దిగారు దీంతో మనస్తాపానికి లోనైన సాంబశివరావు అదృశ్యమయ్యారు.

అయితే ఆయన రైలు నుంచి దూకినట్లు అనుమానిస్తున్నారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వైసీపీ నాయకుల వేధింపులు అరాచకాల పర్వం కొనసాగుతుంది. గత వారం రోజుల క్రితం కళాశాలలో విద్యార్థికీ, లెక్చరర్ కాంతారావు మధ్య చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది.  సినిమాల్లో చూసిన విధంగా లెక్చరర్స్ పై కామెంట్ చేస్తున్న విద్యార్థులను మందలించే క్రమంలో సాంబశివరావ్ ఒక విద్యార్థిపై చేయి చేసుకున్నారు. సాంబశివరావు కుటుంబం గుంటూరు నగరంలో ఉంటుంది, అతను దాచేపల్లిలో అద్దెకు ఓ రూమ్ తీసుకుని ఉంటున్నాడు.

వారాంతంలో కుటుంబ సభ్యుల వద్దకు వచ్చి వెళ్తూ ఉంటాడు. సాంబశివరావుని బెదిరించిన సంఘటన జరిగిన తర్వాత మనస్తాపానికి గురై గుంటూరుకు బయల్దేరాడు. అయితే రైలులో అతను తలుపు దగ్గర నిలబడి ఉండటాన్ని కొంత మంది దాచేపల్లికి చెందిన వారు చూశారన్నారు. అతను ఆ తర్వాత రైల్లోంచి దూకాడన్ని తాము గమనించలేదని రైల్లో చూచిన వ్యక్తులు చెబుతున్నారు.

రాత్రి నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వటం, ఉదయం నుంచి కళాశాలలో, కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకపోవటంతో ఎమయ్యాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ప్రస్తుతం కాళాశాలో మరియు ఇంటి దగ్గర కూడా విచారణ జరిపి గాలింపు చర్యలు చేపట్టారు. విధ్యార్ధికీ , సాంబశివరావుకి మధ్య రాజీ అయిన తరువాత కూడా వైసిపి నేతలు ఎందుకు కలుగజేసుకున్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సాంబశివరావు అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu