ఏపీలో ఒక్కరోజులో 1,322 కరోనా కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఏపీలో కొత్తగా 1322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 197, తూర్పుగోదావరిలో 171, అనంతపురంలో 142, కర్నూలులో 136, చిత్తూరులో 120, పశ్చిమ గోదావరిలో 106, విశాఖపట్నంలో 101 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఒక్కరోజులో ఇన్ని కేసులు రావడం ఇదే మొదటిసారి. అంతేకాదు, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20 వేలు దాటింది. కొత్తగా నమోదయిన కేసులతో కలిపి ఏపీలో కరోనా కేసుల సంఖ్య 20,019కి చేరింది. గడచిన 24 గంటల్లో కరోనాతో ఏపీలో ఏడుగురు మృతి చెందారు. దాంతో కరోనా మరణాల సంఖ్య 239కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 10,860 యాక్టివ్‌ కేసులున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu