రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి

 

కర్ణాటక ఎమ్మెల్యే సిద్దు న్యామ్‌గైడ్‌ ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. సిద్దు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను గుద్దుకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. సిద్దు కర్ణాటకలోని జామ్‌ఖండి అనే అసెంబ్లీ స్థానానికి సిద్దు నేతృత్వం వహిస్తున్నారు. కర్ణాటకలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఎమ్మెల్యేలలో సిద్దు ఒకరు. రామకృష్ణ హెగ్డేలాంటి నేతల్ని సైతం ఓడించి ఎన్నికలలో గెలిచిన ఘనత ఆయనది. అలాంటి నేత దూరం కావడం, కర్ణాటక కాంగ్రెస్‌కు నిజంగా ఎదురుదెబ్బే!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu