దర్శకుడు గీతాకృష్ణపై విశాఖ  కమిషనర్ కు ఫిర్యాదు

సినీ ఇండస్ట్రీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆరోపణలపై   సినీ దర్శకుడు గీతాకృష్ణపై విమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (వివా) విశాఖ పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చికి ఫిర్యాదు చేసింది. అక్కయ్య పాలెం, హైద్రాబాద్ మాదాపూర్ లలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నడుపుతున్న గీతాకృష్ణ వివిధ టీవీ చానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో మహిళలే టార్గెట్ గా అసభ్యకర కామెంట్లు చేస్తున్నారని  వివా ఆరోపించింది. గీతాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వివా డిమాండ్ చేసింది.   గీతా కృష్ణ దర్శకత్వం వహించిన  తొలి చితం సంకీర్తన 1987లో విడుదలైంది. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు దక్కింది.. నాగార్జున ,రమ్యకృష్ణ జంటగా వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ గా హిట్ అయ్యింది. ప్రస్తుతం గీతాకృష్ణ సినిమాలకు దూరంగా ఉంటున్నారు.