అర్చకులకు కేసీఆర్ దసరా కానుక

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ దేశాలయాల్లో పనిచేస్తోన్న అర్చకులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు కురిపించారు. త్వరలోనే అర్చకులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే పే స్కేల్ అమలు చేస్తామన్నారు. ఇవాళ ప్రగతి భవన్‌లో అర్చకులతో సీఎం సమావేశమై..వారి సమస్యలు, ఆలయాల నిర్వహణ, వేతనాల పెంపు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడిన సీఎం..నవంబర్ నుంచి అర్చకులకు పే స్కేలు అమలు చేస్తామని..ఇకపై ప్రతినెల 1న వేతనాలు అందజేస్తామన్నారు..వేతన సవరణ అమలు చేసినప్పుడు దేవాలయ ఉద్యోగుల వేతనాలు కూడా సవరిస్తామని హామీ ఇచ్చారు. ఆలయాల పర్యవేక్షణకు ధార్మిక పరిషత్‌ ఏర్పాటు చేస్తామని..మరో మూడు వేల ఆలయాలకు ధూప దీప నైవేద్యాల పథకం వర్తింపజేస్తామని సీఎం పేర్కొన్నారు.