దాసరి వ్యక్తి కాదు వ్యవస్థ..
posted on May 31, 2017 12:38PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శక రత్న దాసరి నారాయణరావు మృతి పట్ల సంతాపం తెలిపారు. హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు ఫిల్మ్ ఛాంబర్ కు వెళ్లి..దాసరి భౌతికకాయాన్ని దర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దాసరి నారాయణరావు వ్యక్తి కాదు వ్యవస్థ అన్నారు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా దాసరి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారని తెలిపారు. దాసరి మరణం కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే కాదని, యావత్ తెలుగు జాతికి తీరని లోటని అన్నారు. దాసరితో తనకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని ఆయన చెప్పారు. ఆయన తమ కుటుంబానికి సన్నిహితుడని తెలిపారు. కాగా గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన నిన్న మృతి చెందారు. దీంతో దాసరి మరణవార్త తెలిసిన తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురైంది.