'చంద్రన్న బీమా' ప్రారంభం.. వివరాలు ఇవే..


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 'చంద్రన్న బీమా' పథకాన్ని ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి ఆమోదం తెలిపింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలను మంత్రి పల్లె రఘునాథరెడ్డి వివరించారు. ఆ వివరాలు...

 

* ఈ పథకం ద్వారా ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం ఏర్పడినా రూ. 5 లక్షల వరకూ డబ్బు అందుతుంది.
* సహజ మరణం సంభవిస్తే రూ. 30 వేలు
* 18 నుంచి 70 సంవత్సరాలున్న వారికి, నెలకు రూ. 15 వేల కన్నా తక్కువగా ఆదాయం పొందుతున్న వారికి ఇది వర్తిస్తుందని ఆయన అన్నారు.
* ఏడాదికి రూ. 170 బీమా ప్రీమియంగా చెల్లించాల్సి వుంటుందని, అందులో రూ. 150 ప్రభుత్వమే భరిస్తుందని, లబ్దిదారు నుంచి నామమాత్రపు రుసుమునే వసూలు చేస్తామని పల్లె వివరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu