మళ్లీ వచ్చేస్తున్న గొరిల్లా..
posted on Jun 7, 2016 1:02PM
అమెరికాలోని సిన్సినాటి అనే నగరంలో గతవారం ఓ బాలుడిని కాపాడటం కోసం గొరిల్లాను చంపేసిన సంగతి తెలిసిందే. జూ లోని ఓ గొరిల్లా ఎన్ క్లోజర్లో బాలుడు పడిపోగా.. ఆబాలుడిని రక్షించే క్రమంలో పదిహేడేళ్ల గొరిల్లాను చంపేశారు. అనంతరం గొరిల్లాను చంపడంపై పలు విమర్శలు తలెత్తాయి. అయితే ఇప్పుడు ఆ గొరిల్లా ఉన్న చోటును మళ్లీ ప్రారంభిస్తున్నారు. అయితే ఈసారి ఆ ఎన్ క్లోజర్ కు భారీ భద్రతే ఏర్పాటు చేశారు. పెద్ద మొత్తంలో కంచెను ఏర్పాటుచేశారు. చిన్నపిల్లలు సైతం ఎక్కేందుకు వీలుకానంత విధంగా గట్టి రక్షణ చర్యలు తీసుకున్నారు.
కాగా గొరిల్లాను చంపాల్సి వచ్చినందుకు బాలుడి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని కొంతమంది జంతు ప్రియులు కోర్టులో పిటిషన్ వేయగా.. అందుకు నిరాకరించిన కోర్టు ఆ ఎన్ క్లోజర్ వద్ద గట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని మాత్రం సూచించింది.