అది మా ఫ్యామిలీ డిన్నర్.. రామ్ చరణ్...

 

తాను తన ఇంట్లో తన స్నేహితులకు సినీ హీరో రామ్‌చరణ్ సోషల్ మీడియాలో ఖండించారు. శనివారం రాత్రి తన ఇంట్లో తన ఫ్యామిలీ డిన్నర్ మాత్రమే జరిగిందని, ఫ్రెండ్స్‌తో డిన్నర్ చేసి చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించానని వార్తలు రావడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. తాను తన ఇంటి ఇరుగు పొరుగు వారిని గౌరవిస్తానని, వారి ఏకాంతానికి, ఏకాగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరించనని ఆయన స్పష్టం చేశారు. శనివారం రాత్రి హీరో రామ్‌చరణ్ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కొడుకు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమారుడు, మరో ఇద్దరు స్నేహితులు పాల్గొన్నారని, వీరి అరుపులు, కేకలతో స్థానికులకు చిరాకు కలిగించారని, రామ్‌చరణ్ ఇంటి పక్కనే నివాసముంటున్న ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని వార్తలు వచ్చాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu