పాకిస్తాన్ కరోనాకు చైనా వైద్యం...

పాకిస్థాన్‌లోనూ రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 1,197 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తొమ్మిది మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే ఆ దేశానికి సాయం చేసేందుకు చైనా ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఎనిమిది మంది వైద్యనిపుణులు, అవసరమైన వైద్య పరికరాలతో కూడిన ప్రత్యేక విమానం శనివారం ఇస్లామాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నట్టు ఆ దేశ విదేశాంగమంత్రి షా మహ్మద్‌ ఖురేషి తెలిపారు. ఈ వైద్య బృందం పాక్‌లో రెండువారాల పాటు ఉండి తమ వైద్య సిబ్బందికి సరైన సూచనలు ఇస్తూ కరోనా కట్టడికి కృషి చేయనున్నట్లు పాకిస్తాన్ విదేశాంగశాఖ కార్యాలయం వివరించింది.

గత కొన్నేళ్లుగా చైనా, పాకిస్తాన్ ల మధ్య మంచి దౌత్యసంబంధాల ఉన్న కారణంగా 12వేల కరోనావైరస్‌ను నిర్ధారించే కిట్లు, 3లక్షల మాస్కులు, 10వేల రక్షణ సూట్లను ఈ ప్రత్యేకవిమానంలో తీసుకొచ్చినట్టు పాక్‌ విదేశాంగశాఖ తెలిపింది. అలాగే ఐసోలేషన్‌ ఆసుపత్రులను నిర్మించేందుకు అవసరమైన ఆర్థికసాయాన్ని అందించేందుకు చైనాలోని ప్రైవేటు సంస్థలు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. చైనా వ్యాపార సంస్థలైనా అలీబాబా, జాక్‌మా ఫౌండేషన్లు చెరో 50వేల ఫేస్‌ మాస్కులు, కిట్స్‌ను పాక్‌కు దానం చేశాయని, కరోనాపై కలిసిపోరాడాలని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కృతనిశ్చయంతో ఉన్నారని కూడా పాకిస్తాన్ విదేశాంగకార్యాలయం తెలిపింది. కష్టకాలంలో తమను ఆదుకునేందుకు ముందుకొచ్చిన చైనాకు పాక్‌ విదేశాంగమంత్రి ఖురేషి కృతజ్ఞతలు తెలిపారు.

ఇంతవరకూ అంతా బాగానే ఉంది. కష్టంలో ఉన్న దేశానికి సాయం అందించడాన్ని ఎవరూ తప్పు పట్టారు కూడా. కానీ ఇక్కడే కొంతమందికి కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే కరోనా మీ సృష్టి, అంటే మీ సృష్టి అని అమెరికా, చైనా బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ వైరస్ చైనా సృష్టి అని, వాళ్ళ దగ్గర కరోనా విరుగుడు మందు కూడా ఉందని బలంగా నమ్మే వారు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇప్పుడు చైనా వైద్యుల సాయంతో అతి తక్కువ వైద్య సదుపాయాలు కలిగిన పాకిస్తాన్ లో కరోనా వ్యాప్తి నివారించగలిగితే..చైనా ఇప్పటికే తనకు తెలిసిన కరోనా విరుగుడు మందును మిత్ర దేశం పాకిస్తాన్ కు అందించింది అన్న విషయం తేటతెల్లం అవుతుంది అని కొందరు విశ్లేషిస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతోందో..