అంతర్జాతీయ క్రికెట్‌కు చతేశ్వర్ పుజారా గుడ్‌బై
posted on Aug 24, 2025 1:41PM

అంతర్జాతీయ క్రికెట్‌కు చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్లలకు గుడ్‌బై చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. భారత జట్టుకు ఆడాలన్న కలను నెరవేర్చుకోవడంలో తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం పాడటం, గ్రౌండ్‌లో అటుగుపెట్టిన ప్రతిసారి నా శయశక్తులా ఆడేందుకు ప్రయత్నించడటం మాటాల్లో చెప్పలేను అని పేర్కొన్నారు.
రాజ్ కోట్ పట్టణం నుంచి కుటుంబంతో కలిసి వచ్చిన ఓ కుర్రాడు.. భారత క్రికెట్‌లోకి అడుగు పెట్టాలనే కలను నెరవేర్చుకున్నాడు. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, ఎందరో సహకరించారు.. ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు. బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 2010లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన పుజారా 103 టెస్టులు, 5 వన్డేలు ఆడిడారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు పుజారా సాధించారు.