వర్దా తుఫాను... చెన్నై కకావికలం...

 

చెన్నై మరోసారి వర్దా తుఫానుతో జలమయమైపోయింది. నిన్న మధ్యాహ్నం చెన్నై తీరాన్ని దాటిన తుఫాను వల్ల చెన్నైతోపాటు తమిళనాడు తీరప్రాంతం అతలాకుతలమైంది. గంటకు 100 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలుల వల్ల ఐదు జిల్లాలు.. చెన్నై సహా కాంచీపురం, తిరువళ్లూరు, విళుపురం, కడలూరు జిల్లాలను  కుదిపేసింది. తెల్లవారుజాము నుంచే భారీ వర్షాలు ప్రారంభమై అనేక వృక్షాలు కూలిపోయాయి. చెన్నై నగరంలో ఉదయం 11 గంటల నుంచి బలమైన ఈదురుగాలులు, జోరున వర్షం ప్రజలను భయంకపితులను చేసింది. దీంతో చెన్నైలో జనజీవనం స్థంభించిపోయింది.