ఆనాడు పాండవులు..ఈనాడు మావోయిస్టులు

 

ఛత్తీస్‌గఢ్‌ - ఆంధ్రా సరిహద్దుల్లో ఇడుమా బెటాలియన్‌ డిప్యూటీ కమాండర్‌ పొడియం ముడా అలియాస్‌ మల్లేశ్‌ను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.సుకుమా జిల్లాకు చెందిన ముడా మొత్తం 116 మంది భద్రతా సిబ్బంది మృతి కేసుల్లో కీలక పాత్ర పోషించినట్టు జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ తెలిపారు.ముడా గతంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన మంత్రి మహేంద్ర కర్మ హత్య సహా మొత్తం 15 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని ఎస్పీ వివరించారు.అతడి నుంచి పెద్ద ఎత్తున డిటోనేటర్లు, జిలెటిన్‌ స్టిక్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

ఆనాడు పాండవులు జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను దాస్తే నేడు మావోయిస్టులు ఒక చెట్టు తొర్రలో తమ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రంగా ఉంచారు.ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం మినప అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు చేపట్టిన గాలింపు చర్యల్లో ఇవి బయటపడ్డాయి. ఒక చెట్టులో బర్మా తుపాకీ, ఐఈడీ పేలుడు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బురకాపాల్‌ సమీపంలో ప్రమాదకరమైన మూడు స్పైక్‌ రంధ్రాలను కనుగొని నిర్వీర్యం చేశారు.