ప్రజావేదిక స్వాధీనం.. బాబు సామాగ్రి బయట పడేసిన వైనం!!

 

ఏపీ రాజధాని అమరావతిలో ఉండవల్లి సమీపాన కృష్ణా కరకట్టను ఆనుకుని ఉన్న ప్రజావేదికపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య రగడ కొనసాగుతోంది. తాజాగా అధికారులు ప్రజావేదికను ఖాళీ చేయిస్తుండడం, చంద్రబాబు వ్యక్తిగత సామాన్లను సిబ్బంది బయట పడేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

చంద్రబాబు నివాస ప్రాంగణం పక్కనే ఉన్న ఈ ప్రజా వేదికను ప్రతిపక్ష నాయకుడిగా వాడుకునేందుకు తనకు కేటాయించాలంటూ ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారు. అయితే చాలా రోజులైనా ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వం స్పందించలేదు. మరోవైపు.. కలెక్టర్ల సదస్సును ప్రజావేదికలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్ల సదస్సు కోసం ఏర్పాట్లు చేయాలని గుంటూరు జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో  నిన్న సాధారణ పరిపాలన శాఖ అధికారులు, సీఆర్‌డీఏ అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ప్రజావేదిక భవనాన్ని పరిశీలించి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. కనీస సమాచారం లేకుండా, మా నాయకుడి లేఖకు జవాబివ్వకుండా ఇదేం విధానమని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేసున్నారు.