వేణు మాధవ్ మృతిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్...

 

ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. దాంతో పాటు ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా తోడవ్వటంతో కుటుంబ సభ్యులు ఇటీవలే సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్లో చేర్పించారు.

పరిస్థితి విషమించటంతో వెంటిలేటర్ సహాయంతో వేణుమాధవ్ ను బ్రతికించటానికి వైద్యుడు తీవ్రంగా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన కన్ను మూశారు. ఈ క్రమంలో వేణు మాధవ్ మృతిపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు.

మిమిక్రీ కళాకారుడిగా, సినీ హాస్య నటుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసిన వేణుమాధవ్ మృతి విచారకరమని అన్నారు. తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ తనదైన ప్రత్యేకతతో ప్రజలని ఆకట్టుకున్నారు అని తెలిపారు. వేణుమాధవ్ మృతికి నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు.