దేశ వ్యతిరేక పోస్టులు పెట్టే సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లపై ఉక్కుపాదం!

ఇక‌పై దేశ వ్య‌తిరేక పోస్టులు పెట్టేవారికిగానీ, జ‌నాన్ని రెచ్చ‌గొట్టేలాంటి వీడియోలు చేసే వారికి గానీ చుక్కలు చూపించేందుకు రెడీ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం. ఐటీ యాక్ట్-2000 ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడానికి సమాయత్తమౌతోంది.   ప్ర‌స్తుతం ప‌హల్గాం దాడి అనంతరం పాకిస్థాన్ తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశమంతటా ఒక విధమైన ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉంది. ఉగ్రదాడికి పాల్పడిన వారు, వారికి సహకరించిన వారు, సహకారం అందించిన వారూ ఎవరినీ వదలేది లేదన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర పేరుతో సర్జికల్ స్ట్రైక్ జరిపంది. ఈ స‌మ‌యంలో ఎవ‌రంటే వారు.. ఎలా ప‌డితే అలా.. ఏది ప‌డితే అది.. వాగేస్తూ, సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెడుతూ లేనిపోని అనుమానాలు రేకెత్తించేలా వ్యవహరిస్తే కుదరదు. అటువంటి వారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదనీ, అలాంటి వారి ఖేల్ ఖతం చేసి దుకాణ్ బంద్ పెట్టేస్తామని హెచ్చిరిస్తోంది కేంద్రం.  ఇలా దేశ వ్యతిరేక పోస్టులు పెట్టే వారు ఎవరైనా ఎరుకలో ఉంటే వారి వివరాలను, వారి సోషల్ మీడియా అక్కౌంట్ వివరాలను comit@sansad.nic.inకి ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచిస్తోంది.

 గ‌త ఎన్నికల్లో తాము అనుకున్న ఫ‌లితం సాధించ‌లేక పోవ‌డానికి ఇలాంటి ఇన్ ఫ్లూయెన్ష‌ర్లే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని న‌మ్ముతోంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. ఇలాంటి వారికి ఎ  గ‌ట్టిగా బుద్ధి చెప్పాల‌నుకున్న కేంద్రానికి పహల్గాం ఉగ్రదాడి, తదననంతర పరిణామాలు కలిసివచ్చాయి. ఎలాగైనా సరే దేశ వ్యతిరేక ప్రచారం చేసే సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో కొరడా ఝుళిపించడానికి రెడీ అయిపోయింది.  

ఇంత‌కీ ఈ ఇన్ ఫ్లూయెన్ష‌ర్లు ఎవ‌రు? వారు ఎలాంటి వీడియోలు చేయ‌కూడ‌దు అన్న విషయానికి వస్తే..  ఫ‌స్ట్ దేశ భ‌ద్ర‌త విష‌యంలో రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌డం, అలాగే సోషల్ మీడియాలో పెట్టే పోస్టులలో కామెంట్లు   హింస‌ను ప్రేరేపించేలా ఉండటం వంటివి చేసే వారి సోషల్ మీడియా అక్కౌంట్లను సీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.  

ఈ దాడుల వెన‌క ఫ‌లానా పార్టీ ఉంద‌ని.. సెక్యూరిటీ విష‌యంలో మ‌న భ‌ద్ర‌తా ద‌ళాలు ఫెయిల్ అయ్యాయ‌నీ.. సంబంధిత శాఖా మంత్రి రాజీనామా చేయాల‌ని.. ఇలా ప‌లు ప‌లు విధాలుగా కేంద్ర ప్ర‌భుత్వ ప‌ని తీరును ఇర‌కాటంలోకి నెట్ట‌డం.. ఈ దిశ‌గా దేశ ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌లోకి నెట్ట‌డం.. దేశ సార్వ‌భౌమాధికారానికే భంగం క‌లిగేలా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం ఇక నుంచి కుదరని పని. ఎవరైనా సరే అటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా.. కుట్రవెనుక ఫలానా వారు ఉన్నారంటూ ఆధారరహిత సమాచారాన్ని వ్యాప్తి చేసినా

మీరుగానీ ఇలాంటి రెచ్చ‌గొట్టుడు వ్యాఖ్య‌లు చేసే ప‌నైతే.. ఈ కుట్ర వెన‌క ఫ‌లానా వారున్నారంటూ లేని పోని సమాచారాన్ని ఎలాంటి ఆధారాల్లేకుండా ఊహాగానాల‌ను వ్యాప్తి చేసిన వారి ప‌ని ఇక అయిపోయినట్ల... ఇలాంటి వారిని క‌ట్ట‌డి చేయ‌డానికి ఇప్ప‌టికే ఒక ముసాయిదా త‌యారు చేసిన కేంద్రం.. దాన్ని ఎలాగైనా స‌రే క‌ట్ట‌డి చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

సో ఇన్ ఫ్లూయెన్ష‌ర్స్.. బీ అవేర్ ఆఫ్ ఇట్. ఇప్ప‌టి వ‌ర‌కూ మీరు ఆడింది ఆట పాడింది పాట‌గా సాగిందేమో.. ఇక‌పై  దేశ పాల‌నా వ్య‌వ‌స్థ‌ను నిల‌దీస్తూ మీరేదైనా పోస్టు పెట్టినా.. మీ కంటెంట్ ని ఎవ‌రైనా షేర్ కొట్టినా.. ఇటు కంటెంట్ క్రియేట‌ర్లైన మీతో పాటు షేర్ కొట్టే వారిని సైతం వద‌ల‌క వెంటాడి వేటాడి మ‌రీ మిమ్మ‌ల్ని అరెస్టు చేస్తారు. ఇక‌పై మీ సోష‌ల్ మీడియా ఖాతాలు జ‌ప్త‌యిపోతాయి ఖ‌బ‌డ్దార్ అంటోంది కేంద్రం. 

మ‌ళ్లీ మేము కొత్తగా మా అకౌంట్ ఓపెన్ చేసుకోవ‌చ్చ‌ని మీరు లైట్ తీస్కోవ‌చ్చేమో.. ఒక్క‌సారి బ్లాక్ మార్క్ ప‌డితే త‌ర్వాతి కాలంలో మీకు సోష‌ల్ మీడియా అకౌంట్ తెరుచుకోక పోవ‌చ్చు. ఎందుకంటే ఇది దేశ భ‌ద్ర‌తకు సంబంధించే విష‌యం. కాబ‌ట్టి ఉపేక్షించే ప్ర‌సక్తే లేద‌ని తేల్చి చెబుతున్నారు అధికారులు జాగ్ర‌త్త‌! మీ సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా మిమ్మ‌ల్ని ఐడెంటిఫై చేసి.. ఇక‌పై మీరెలాంటి సోష‌ల్ మీడియా యాక్టివిటీస్ న‌డ‌ప‌కుండా క‌ట్ట‌డి చేస్తారు బీ కేర్ ఫుల్ అన్న‌ది కేంద్రం నుంచి వ‌స్తోన్న   వార్నింగ్.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu