పని తీరే ప్రామాణికం.. ఇదీ చంద్ర‌బాబు స్కూల్ అంటే

జగన్ హయాంలో ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో అరాచకం తాండవించింది. దాడులకు, దౌర్జన్యాలకూ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. తప్పులు చేసిన వారిపై చర్యలు లేవు.అకృత్యాలకూ, అత్యాచారాలకు, హత్యలకు పాల్పడిన వారిపై కేసులు లేవు, ,చర్యలు లేవు సరికదా ఎదురు బాధితులే వేధింపులకు గురైన పరిస్థతి. వరదలు, తుపానులు వంటి విపత్తులు జరిగిన సమయాలలో ప్రభుత్వం నుంచి స్పందన లేదు, సహకారం లేదు. అసలా ఐదేళ్లూ రాష్ట్రంలోఅసలు ప్రభుత్వం అనేది ఉందా అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. 
ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారంలో ఉంది. జవాబుదారీ తనంతో పని చేస్తున్నది. ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్నది. జగన్ ప్రభుత్వం దిగిపోయి, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నిండా మూడు నెలలు కాలేదు. అయినా రాష్ట్రంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అభివృద్ధి ఉరకలేస్తోంది. సంక్షేమం నిజమైన అర్దం ఏమిటో తెలిసేలా పథకాలు అమలు అవుతున్నాయి. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు ప్రభుత్వ వారిని అన్ని విధాలుగా ఆదుకుంటోంది. మూడు నెలలలోనే ఇంతటి మార్పునకు కారణమేంటి? అంటే లభించే జవాబు. నాయకత్వం. సమర్థుడైన నాయకుడు తాను కష్టపడటమే కాదు... తన టీమ్ ను సైతం సమర్థంగా పని చేసేలా గైడ్ చేస్తారు. ప్రభుత్వం, పాలనా అన్నది ఒక సమష్టి బాధ్యత అన్న భావన అందరిలో కలిగిస్తారు. 
టీమ్ స్ఫిరిట్ అన్నది అందరిలోనూ నింపుతారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఒక స్కూల్ లో  ప్ర‌ధానోపాధ్యాయుడు స‌మ‌ర్ధుడైతే.. ఆయ‌న ఆలోచ‌న‌ల‌కు, సూచ‌న‌ల‌కు అనుగుణంగా ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల‌ను ఉన్న‌తులుగా తీర్చిదిద్ద‌ుతారు. అందు కోసం శ్రమిస్తారు.  త‌ద్వారా విద్యార్థుల బంగారు భ‌విష్య‌త్తుకు బ‌ల‌మైన పునాదులు ప‌డ‌తాయి. అదే త‌ర‌హాలో ప్ర‌భుత్వాన్ని న‌డిపించే ముఖ్య‌మంత్రి స‌మ‌ర్ధ‌ుడైతే మంత్రివ‌ర్గం, నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తారు. ప్ర‌జ‌ల సాధక‌ బాధ‌కాల్లో పాలుపంచుకుంటారు. ప్ర‌స్తుతం ఏపీలో సరిగ్గా అలాంటి సమర్థ ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్ర‌భుత్వ‌మే ఉంది. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జ‌రుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. అదే సమయంలో అభివృద్ధినీ ప‌రుగులు పెట్టిస్తున్నారు. కష్టం వస్తే సమష్టిగా కదిలి బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో విజయవాడను భారీ వర్షాలు వరదలూ ముంచెత్తి రోజుల తరబడి ప్రజలు ముంపులో చిక్కుకుంటే.. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కదిలింది. బాధితులను ఆదుకుంది. భరోసా ఇచ్చింది. ధైర్యం చెప్పింది. కష్టాలలో తాము ఒంటరిగా లేమన్న ధీమాను జనంలో కలిగించింది. 

ప్రకాశం బ్యారేజీ వద్ద రికార్డు స్థాయిలో వరద ప్రవాహం రావడం, ఎన్నడూ లేని విధంగా  బుడ‌మేరు పోంగి పొర్లడం.. మూడు ప్రాంతాల్లో గండ్లు ప‌డ‌టంతో విజవాడ‌లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. మ‌నిషి లోతు నీళ్లు చేరాయి. అప్ర‌మ‌త్త‌మైన సీఎం చంద్ర‌బాబు నాయుడు వ‌ర‌ద‌నీరు వ‌చ్చిన కొద్ది గంట‌ల నుంచే ముంపు ప్రాంతాల్లో స్వ‌యంగా పర్యటించి ముంపు బాధితులకు భరోసా ఇవ్వడమే కాకుండా స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. ఏడు రోజులుగా ముంపు బాధితుల‌కు ప్ర‌భుత్వం ఆహారం, కూర‌గాయ‌లు, పాలు, పండ్లు అందిస్తూ వారికి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూస్తున్నారు. ముంపు బాధితులలో ధైర్యాన్ని నింపారు. నేనున్నా అన్న భరోసా ఇచ్చారు. ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం   ప‌డుతుండ‌టంతో ముంపు ప్రాంతాల ప్ర‌జ‌లు ఊపిరిపీల్చుకుంటున్నారు. 

విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద ముంచెత్తిన విష‌యం ప‌క్క‌న‌పెడితే.. వ‌ర‌ద ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం అందిస్తున్న స‌హాయ‌క చ‌ర్య‌లను చూసి దేశం మొత్తం ఆశ్చ‌ర్య‌పోతుంది. ఆపత్సమయాలలో ప్రజలను ఆదుకునే తీరు ఇదే అంటూ ప్రశంసలు గుప్పిస్తోంది.  స‌మ‌ర్ధ‌ సీఎం ఉంటే.. ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య ఎదురైనా ఇబ్బంది ఉండద‌న్న విష‌యాన్ని  చంద్ర‌బాబు నాయుడు దేశానికి మ‌రోసారి చాటి చెప్పారు. విజయవాడ ముంపు బాధితులను ఆదుకోవడంలోనూ, వారికి ధైర్యం చెప్పి భరోసా ఇవ్వడంలోనూ చంద్రబాబే ఒక సైన్యంగా, ఒక ధైర్యంగా నిలబడ్డారు. జాతీయ మీడియా సైతం సీఎం చంద్ర‌బాబు నాయుడు వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తుండటం, మంత్రివ‌ర్గం, అధికారులు, ఎమ్మెల్యేలు ముంపు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తున్న తీరుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా విజ‌య‌వాడ న‌గ‌రంలోకి వ‌ర‌ద రావ‌డానికి కార‌ణ‌మైన బుడ‌మేరుకు ప‌డిన మూడు గండ్ల‌ను ద‌గ్గ‌రుండి పూడ్చివేయించే బాధ్య‌త‌ల‌ను సీఎం చంద్ర‌బాబు నాయుడు నీటిపారుద‌ల శాఖ మంత్రి రామానాయుడుకు అప్ప‌గించారు. చంద్ర‌బాబు ఆదేశాల‌ మేర‌కు రాత్రి, ప‌గ‌లు అనే తేడాలేకుండా.. వ‌ర్షం, చ‌లిని లెక్క చేయకుండా గండ్ల వ‌ద్ద‌నే ఉండి ద‌గ్గ‌రుండి ప‌నులు వేగంగా చేయించారు. మూడు రోజుల్లోనే మూడు గండ్ల‌ను పూడ్చివేసి శెభాష్ రామానాయుడు అనిపించుకున్నారు. ఒక్క రామానాయుడే కాదు.. మంత్రివ‌ర్గం, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ముంపు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న సేవ‌ల‌ను చూసి రాష్ట్ర ప్ర‌జ‌లు హర్షం  వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి ప్ర‌భుత్వాన్ని ఎన్నుకున్నందుకు గ‌ర్వంగా ఉందంటూ పొంగిపోతున్నారు. 

నిర్మ‌ల రామానాయుడుతో పాటు.. మంత్రివ‌ర్గం మొత్తం వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మైంది. గ‌తవారం రోజులుగా మంత్రి నారా లోకేశ్‌ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ, కంట్రోల్ రూమ్ ఉండి వ‌ర‌ద ప్రాంతాల్లో అందుతున్న స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఆర్టీజీఎస్ శాఖ మంత్రిగా లోకేష్ రియల్ టైమ్ గవర్నెన్స్ పవరేంటో చూపారు. వ‌రద ఉధృతంగా ఉన్న మూడురోజులు తన నియోజకవర్గంలో కరకట్టకు కాపలాకాసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వరద తగ్గిన వెంటనే రంగంలోకి దిగి రాష్ట్ర నలుమూలల నుంచి నిత్యావసర సరుకులు తెప్పించి, బాధితులకు అందించే పనిలో ఉన్నారు. ఇక రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రెండు రోజుల పాటు తన నియోజకవర్గంలో కట్ట‌కు కాపలాకాసి, తర్వాత నుంచి గండ్లుపూడ్చే పనిలో నిమ‌గ్న‌మ‌య్యారు. అలాగే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, తన జిల్లాలో కట్టకు గండి పడకుండా అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. వానలో వరదలో ఆయన ప్రజల మధ్యనే నిలిచారు. వరద తగ్గుముఖం పట్టగానే ముంపు ప్రాంతాలలో  విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలపై దృష్టిపెట్టారు. అత్యంత వేగంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేలా చూశారు.  మున్సిపల్ శాఖ మంత్రి  పొంగూరు నారాయణ  వరద ప్రాంతాల్లోనే మకాం వేశారు. ప్రజలకు ఏ కష్టం రాకుండా కాపు కాశారు. ముంపు తగ్గిన తరువాత ఆయా ప్రాంతాలలో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని రప్పించి ముంపు ప్రాంతాల్లో క్లీనింగ్ చేయిస్తున్నారు. విపత్తులశాఖ కూడా చూసే హోమ్ అనిత అయితే  విశ్రాంతి అనే మాటే లేకుండా చంద్ర‌బాబు వెంట వరద నీటిలోనే తిరుగుతూ ప్ర‌జ‌ల‌కు ఆహారం, కూర‌గాయ‌లు, పండ్లు స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఇక  ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఒకపక్క ముంపు ప్రాంతాలలో పర్యటనలు చేస్తూ, మరో పక్క కేంద్రంతో సంప్రదింపులు జరుపుదూ కేంద్ర సాయం జాప్యం లేకుండా వచ్చేలా చేస్తున్నారు.

 దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో దుర్గ గుడి కిచెన్ లో లక్షల ఆహార పొట్లాలు తయార‌వుతున్నాయి. వండిన ఆహారం అయితే త్వరగా చెడిపోతుంద‌ని మార్కెటింగ్, వ్యవసాయ శాఖల ద్వారా లక్షల సంఖ్యలో యాపిల్స్ సేకరించారు. ఇక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాంమ‌నోహ‌ర్ నాయుడు మొదటి రెండు రోజులు కంట్రోల్ రూమ్‌లో ఉండి వ‌రద ముంపు ప్రాంతాల్లో అధికారుల‌కు త‌గు సూచ‌న‌లు చేస్తూ వ‌చ్చారు. అదే సమయంలో చంద్రబాబు సూచనల మేరకు డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహార పదార్ధాలు అందించే విషయంలో సత్వర అనుమతులు వచ్చేలా చేశారు. మ‌రో కేంద్ర మంత్రి తన నియోజకవర్గంలో వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితుల‌కు అండ‌గా నిలబడ్డారు.  ఇక రాష్ట్ర వ్యాప్తంగాఉన్న తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ ఎమ్మెల్యేలు  ముంపు ప్రాంతాల్లో బాధితుల‌కు ఆహారం, కూర‌గాయ‌లు, పండ్లు స‌ర‌ఫ‌రా చేయ‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు. మంత్రులంతా వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఉంటే.. రాష్ట్రంలో సాధార‌ణ పాల‌న ప‌రిస్థితి ఏమిట‌? అన్న అనుమానాలే ఎవరికీ కలగకుండా పాలన సాగింది. 
ఒక వైపు మంత్రులంతా వరద ముంపు ప్రాంతాలలో సహాయ పునరావాస కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్న సమయంలో.. వరద ముంపులో ఉన్న విజ‌య‌వాడ‌లోనే వేదాంత కంపెనీ  83వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు ముంచుకొచ్చింది. ఈ కార్య‌క్ర‌మానికి  పెట్టుబ‌డుల శాఖ మంత్రి హాజరయ్యారు. మరో మంత్రి ఢిల్లీలో మంత్రుల సదస్సులో ఉన్నాడు. రోజువారీ ప్ర‌భుత్వలో జ‌ర‌గాల్సిన ప‌నుల‌న్నీ జరుగుతూనే ఉన్నాయి. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో ఏపీలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పాల‌న‌ను చూసి దేశం మొత్తం ఆశ్చ‌ర్య‌పోతుంది. ఇదీ ప్ర‌భుత్వాన్ని న‌డిపించ‌డం అంటే.. ఇదీ ప్రజల విషయంలో బాధ్యతగా ఉండడం అంటే.. ఇదీ ప్రజలకోసం పని చేయడం అంటే.. అంటూ దేశ‌వ్యాప్తంగా ప్ర‌ముఖుల నుంచి, రాష్ట్ర ప్ర‌జ‌ల నుంచి చంద్ర‌బాబు, ఆయ‌న టీంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.