ఇది తెలుసుకోకుంటే గుండెకు గండి పడుతుంది!!

లావుగా ఉన్నవారిని సాధారణంగా స్థూల దేహం కలవారని, స్థూలకాయులు అని అంటారు. ఇలా లావుగా ఉండటం వల్ల ఎన్నో అసౌకర్యాలు ఉన్నా వాటికంటే ప్రమాదకరమైనది ఆరోగ్య సమస్యల ముప్పు. లావుగా ఉన్నవారిలో ఆరోగ్య సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే…


స్థూలదేహాలలో తరచుగా క్రొవ్వు పదార్థము ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్ల క్రొవ్వు కణాల సంఖ్య రక్తంలో ఎక్కువ అవుతాయి. అందువల్ల స్థూల శరీరం ఉన్నవారిలో రక్తం  చిక్కగా మారుతుంది. ఈ చిక్కదనం వల్ల రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. ఈ రక్తంలో ఉన్న కొవ్వు కణాలు అన్నీ రక్తనాళాలలో పేరుకుని పోయి అవి ప్లేట్లెట్స్ గా తయారవుతాయి. ఇవన్నీ ముందే నెమ్మదించిన రక్త ప్రవాహానికి మరింత ఆటంకం కలిగిస్తాయి. అంతే కాకుండా ఇవి రక్తనాళాలు కుచించుకుని పోవడానికి కారణం అవుతాయి. ఈ అన్నిటి కారణాల వల్ల గుండెకు జరగాల్సినంత మోతాదులో రక్తప్రవహం జరగదు.   గుండెకు తగినంత రక్తప్రవహం లేకపోతే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా గుండె ద్వారములలో వాల్వ్  లు ఉంటాయి. ఈ వాల్వ్ లలో అసమతుల్యత ఏర్పడినప్పుడు కూడా  గుండెజబ్బులు వస్తాయి. ఈ పరిస్థితిని రొమేటిక్ హార్ట్ అని అంటారు. ఇలాంటి పరిస్థితి సాధారణంగా 8నుండి 12 సంవత్సరాల వయసు గల పిల్లలలో ఏర్పడుతుంది. 


ఇకపోతే  స్థూలదేహం ఉన్నవారిలో చాలా మందికి కొరోనరీ హార్డు డిసీజ్ (C.A.D.) అనే వ్యాధి తరచుగా వస్తుంది. ప్రస్తుత జనరేషన్ లో ఈ సమస్య కారణంగా వైద్యులను ఆశ్రయిస్తున్నవారే మొదటి స్థానంలో ఉంటున్నారు. దీని కారణంగా సంభవిస్తున్న మరణాల స్థాయి కూడా అధికంగానే ఉంది. గుండె సంబంధ సమస్యల కారణంగా మరణిస్తున్న వారిలో మొదటి స్థానంలో ఈ సమస్య వల్ల మరణించే వారే ఎక్కువగా ఉన్నారు. అందుకే కార్డియాలజిస్టుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.  


కొరోనరీ ఆర్టరీస్ అనేవి ప్రాణవాయువుతో గూడిన స్వచ్ఛమైన రక్తాన్ని గుండెలకందించే ప్రధాన నాళాలు.  మన గుండెకు ప్రతిక్షణం స్వచ్ఛమైన రక్తం అందాలంటే కొరోనరీ ఆర్టరీస్ ఆరోగ్యంగా ఉండాలి. స్థూలదేహం గలవారిలో రక్తంలో క్రొవ్వుకణాలు అదనంగా పేరుకొని ఉండటం  వల్ల వీటి మార్గము సన్నగా మారిపోయి ప్రవాహములకు అవరోదం ఏర్పడుతోంది. 


ఈ కొరోనరీ ఆర్టరీస్ రెండు రకాలు. అవి గుండెకు కుడి, ఎడమ ప్రాంతాలలో వ్యాపించి ఉంటాయి. ఎడమ భాగంలో ఎడమ డి నెంటరీ ఆర్జరీ అని, నర్ కాంప్లెక్స్  రెండు రకములు గలవు. కుడి భాగములో కుడి డిసెంటరీ ఆర్జరీ మాత్రము ఉంటుంది. వీటి ద్వారా కుడి యడమలందు గల గుండె భాగములకు స్వచ్ఛమైన రక్తం అందించబడుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ లైనింగ్ పొర దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చుట్ట, బీడీ, సిగరెట్లు త్రాగడం వల్ల వచ్చే నికోటిన్  వల్ల, విషపు మందులు, మత్తు మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల రక్తంలోని ప్రాణశక్తి తగ్గిపోయి క్రొవ్వుకణాలు అడ్డుకోవడం వల్లా, ఈ ప్రాంతాలు మైల్డ్ గా  బ్లాక్ అవుతాయి. ఇలాంటి పరిస్థితిలోనే గుండెనొప్పి వస్తుంది.  ఈ గుండె నొప్పి మెల్లగా మొదలై అది భుజము నుండి  ఎడమచేతి మోచేతి వరకు  వ్యాపించడం జరుగుతుంది.   క్రమంగా ఈ ఆర్డరీలు మూసుకొనిపోయే ప్రమాదం గూడా ఉంటుంది.


గుండెజబ్బుకు రావడానికి ఇలాంటి కారణాలు చాలా ఉంటాయి. డాక్టర్ల ప్రకారం ఇలాంటివి సుమారు 200 రకాలు ఉన్నాయట. గుండె జబ్బులకు ప్రధాన కారణం అధిక బరువు అయినా ఇవి మాత్రమే కాకుండా  దుర్వ్యసనాలు, మానసిక ఒత్తిడి కొలెస్ట్రాల్ పెరగడం, వేళాపాళా లేని భోజనాలు, బయటి చిరుతిండ్లు, కాఫీ, టీలు, అధికమోతాదు మాంసాహారం ఇలాంటివన్నీ అంటున్నారు వైద్యులు. కాబట్టి గుండె పదిలంగా ఉండాలంటే వీటన్నిటి గురించి జాగ్రత్తలు అవసరం.  


                                ◆నిశ్శబ్ద.