బిడ్డకు జన్మనిచ్చిన పురుషుడు

పురుషుడేంటి బిడ్డకు జన్మనివ్వడం ఏంటి అనుకుంటున్నారా..అక్కడికే వస్తున్నాం. బ్రిటన్‌కు చెందిన 21 ఏళ్ల హేడెన్ క్రాస్ పుట్టుకతో స్త్రీ అయితే లింగమార్పిడి చేసుకుని పురుషుడిలా మారాడు..మూడేళ్ల నుంచి అబ్బాయిలా జీవిస్తున్నాడు..పురుషుడిగా మారేందుకు హర్మోన్ల చికిత్స చేయించుకున్నాడు..దీంతో భవిష్యత్తులో బిడ్డలను కనడం కుదరదేమోనని అంతకు ముందుగానే ఓ బిడ్డను కనాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తనకు వీర్యం దానం చేయాలని ఫేస్‌బుక్‌లో కోరాడు..దీనికి స్పందించిన ఓ వ్యక్తి వీర్యం దానం చేయడంతో హేడెన్ గర్భం దాల్చాడు. మగాడు గర్భం దాల్చాడు అన్న ఈ వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది. తొమ్మిది నెలల తర్వాత గత నెల 16న లండన్‌లోని గ్లోసెస్టేర్ రాయల్ హస్పిటల్‌లో హేడెన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చాడు. ఆ పాపకు పైగే అని పేరు కూడా పెట్టాడు. అయితే హేడెన్‌ కంటే ముందే అమెరికాకు చెందిన థామస్ బెయిటీ వీర్యదాత ద్వారా గర్భం దాల్చాడు..ప్రస్తుతం అతనికి ముగ్గురు పిల్లలు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu