'బ్రహ్మవరం పి.ఎస్. పరిధిలో' మూవీ రివ్యూ

తారాగణం: స్రవంతి బెల్లంకొండ, గురు చరణ్, సూర్య శ్రీనివాస్, హర్షిని కోడూరు, రూప లక్ష్మీ, ప్రేమ్ సాగర్, సమ్మెట గాంధీ, రుద్ర తిప్పే స్వామి తదితరులు
డీఓపీ: ముజీర్ మాలిక్ 
సంగీతం: శ్రీ వెంకట్
దర్శకత్వం: ఇమ్రాన్ శాస్త్రి
బ్యానర్: డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ: ఆగస్టు 23, 2024

డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం “బ్రహ్మవరం P.S. పరిధిలో”. ఈ సినిమాను ఇమ్రాన్ శాస్త్రి డైరెక్ట్ చేయగా, స్రవంతి బెల్లంకొండ, గురు, సూర్య శ్రీనివాస్, హర్షిణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్ట్ 23న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:
అమెరికా నుండి చైత్ర(స్రవంతి) ఇండియాలోని బ్రహ్మవరం కి బయల్దేరుతుంది. అదే రోజు రాత్రి బ్రహ్మవరం లో పోలీస్ స్టేషన్ దగ్గర ఒక శవం పడి ఉంటుంది. అక్కడ్నుంచి కథ 99 రోజుల వెనక్కి వెళుతుంది. సాప్ట్ వేర్ ఉద్యోగిని అయిన చైత్ర.. సూర్య (సూర్య శ్రీనివాస్) ని ప్రేమిస్తుంది.. ఈ కథకి ప్యార్లల్ గా గౌతమ్ (గురు చరణ్) కథ నడుస్తుంది. గౌతమ్ తండ్రి పట్టాభి(ప్రేమ సాగర్) కానిస్టేబుల్.స్టేషన్ లో ఎస్ఐ తో అతనికి విభేదాలుంటాయి. అసలు చైత్ర బ్రహ్మవరం ఎందుకు వచ్చింది. సూర్య కి ఏమైంది? గౌతమ్, చైత్ర ఎలా, ఎందుకు కలిశారు. పోలీస్ స్టేషన్ దగ్గర పడి ఉన్న శవం ఎవరిది? లాంటి ప్రశ్నలకి సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాలి.

విశ్లేషణ:
సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కే కొత్త తరహా చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఈ తరహా స్టోరీ లైన్ ని ఎంచుకోవడంలోనే దర్శకుడు ఇమ్రాన్ శాస్త్రి సగం సక్సెస్ అయ్యాడు. ఎంచుకున్న కథను, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపిస్తూ.. ప్రేక్షకులను మెప్పించడంలోనూ మంచి మార్కులే కొట్టేశాడు. సస్పెన్స్ థ్రిల్లర్ అనగానే.. ఒక మర్డర్ జరగడం, దాని చుట్టూ ఇన్వెస్టిగేషన్ జరగడం, చివరికి హంతకుడు ఎవరో తెలియడం.. ఇలా దాదాపు ఒకే ప్యాట్రన్ లోనే నడుస్తాయి. అయితే ఇందులో పోలీస్ స్టేషన్ దగ్గర ఒక తల లేని శవాన్ని చూపించి.. ఆ శవం ఎవరిది? హత్య ఎవరు చేశారు? అనే క్యూరియాసిటీని కలిగిస్తూనే.. పారలెల్ గా లవ్, ఎమోషన్స్, పెయిన్ ఉండేలా చూసుకున్నారు. ఒక ప్లేస్ లో జరిగిన ఘటనతో ఇద్దరు స్ట్రేంజర్స్ కలవడం, వారి వారి స్టోరీలతో సినిమా భిన్నంగా నడిచింది.  

ముజీర్ మాలిక్ కెమెరా పనితనం బాగుంది. శ్రీ వెంకట్ అంధించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కథలకు ఆర్ఆర్ బాగా కుదరాలి. ఈ సినిమాకు శ్రీ వెంకట్ బెస్ట్ వర్క్ ఇచ్చారు. 

ఈ సినిమాలో స్రవంతి బెల్లంకొండ, గురు చరణ్, సూర్య శ్రీనివాస్, హర్షిని కోడూరు, రూప లక్ష్మీ, ప్రేమ్ సాగర్ , సమ్మెట గాంధీ, రుద్ర తిప్పే స్వామి వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మెయిన్ హీరోయిన్ గా చేసిన స్రవంతి మొదటి సినిమా అయినప్పటికీ చాలా బాగా నటించింది.

ఫైనల్ గా.. 
'బ్రహ్మవారం పిఎస్ పరిధిలో' గుడ్ సస్పెన్స్ థ్రిల్లర్. రొటీన్ కు భిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.