Brahmamudi : అదంతా నీ ప్లాన్ అని నాకు తెలుసు.. మొహంపై డోర్ వేసిన అత్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -444 లో.....మన ప్లాన్స్ అని ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు ఆ రాజ్ ఎప్పటిలాగే ఆఫీస్ కి వస్తాడని రుద్రాణితో రాహుల్ అంటుంటాడు. అప్పుడే కావ్య వచ్చి.. అందులో ఎలాంటి డౌట్ లేదని కావ్య అంటుంది. అయన స్థానం ఎప్పటికి తనదే అని కావ్య అనగానే.. అది మేమ్ లాక్కోవాలనేం అనుకోలేదని రాహుల్ అంటాడు. మీరేం అనుకున్నారో మీ మొహాలు చూస్తేనే అర్ధం అవుతుందని కావ్య అంటుంది. మాయని తీసుకొని వచ్చి నిజం చెప్పించి గెలిచాననుకుంటున్నావా అని రుద్రాణి అంటుంది.

నాకు తెలుసు ఇదంతా మీరే చేశారని కావ్య అంటుంది. మేమ్ చెయ్యడమేంటని రుద్రాణి అంటుంది. మాయ బాబుని తీసుకొని వచ్చేవరకు తన ప్లాన్.. ఆ తర్వాత తనని కిడ్నాప్ చేయించింది మొత్తం నీ ప్లాన్.. ఇదిగో మాయని కాపాడినప్పుడు రౌడీ నుండి పడిపోయిన ఫోన్.. ఇందులో నీ నెంబర్ ఉందని కావ్య అంటుంది. నెంబర్ ఉంటే నేనే చేయించినట్లా అని రుద్రాణి అనగానే.. ఇందులో నువ్వు రౌడీతో మాట్లాడిన మాటలన్నీ ఉన్నాయని కావ్య అంటుంది. నాకు క్షణం పట్టదు మీ నిజస్వరూపం బయట పెట్టి ఇంట్లో నుండి పంపించడం కానీ మీరు బయటకు వెళ్తే.. నా అక్క కూడా శిక్ష అనుభవిస్తుంది. అందుకే నేను చెప్పట్లేదు వదిలేస్తున్నానని కావ్య అంటుంది. మరొకవైపు అపర్ణ దగ్గరికి సుభాష్ వచ్చి.. నన్ను క్షమించినందుకు చాలా థాంక్స్ అని అంటాడు. ఇంత కస్టపడి కావ్య నిజాన్ని బయటపెట్టింది అందుకే అక్కడ ఏం అన్లేదు. నిన్ను ఎప్పటికి క్షమించను బిడ్డకి తండ్రివి కాదని తెలిసింది. అంతే కానీ నీ చేతులతో ఆమెని తాకి తప్పు చేయలేదా అలాంటిది నిన్ను ఎలా క్షమిస్తాను. బయట మనం భార్యాభర్తలం గదిలో ఈ దూరం ఎప్పటికి దగ్గర కాదని అపర్ణ అంటుంది.

ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. ఇక మొదలు పెట్టండంటూ కావ్య అనగానే.. రాజ్ కి అర్థం కాదు. తిడతారు కదా ఏదో ఒకటి అని కావ్య అంటుంది. కాసేపటికి కావ్య వెళ్లి పోయాక తనకి ఎలా ప్రపోజ్ చెయ్యాలో నాకు తెలుసని రాజ్ అనుకుంటాడు. మరొకవైపు కనకం ఇంటికి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి.. మీ అమ్మాయి లాడ్జ్ లో దొరికిందంటగా అని అంటుంటే కనకం వాళ్ళని తన తిట్లతో పరిగెత్తిస్తుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. తనని చూసి కనకం తన మొహంపైనే డోర్ వేస్తుంది. తరువాయి భాగంలో కావ్య వర్క్ చేస్తుంటుంటే.. రాజ్ తన వంకే రొమాంటిక్ గా చూస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.