బ్రహ్మకుమారీ చీఫ్ దాదీ రతన్ మోహిని కన్నుమూత

ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీల చీఫ్​ దాది రతన్ మోహిని ఇక లేరు. ఆమె వయస్సు వంద సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (ఏప్రిల్ 8) తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆమె పరమపదించిన విషయాన్ని బ్రహ్మకుమారీ సంస్థ పీఆర్వో ధృవీకరించారు.   
గత నెల 25న వందవ పుట్టిన రోజు జరుపుకున్న రతన్ మోహిని గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు.

ఆదివారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రాజస్థాన్లోని ట్రామా సెంటర్ కు తరలించారు. అయితే సోమవారం నాటికి ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో అహ్మదాబాద్ లోని జైడన్ ఆస్పత్రిలో చేర్చారు.అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆమె పార్ధివదేహాన్ని రాజస్థాన్ లోని బ్రహ్మకుమారీస్   ప్రధాన కార్యాల‌యానికి తీసుకువెళ్లారు. 

    సింధ్‌లోని హైద‌రాబాద్‌లో జన్మించిన  దాది ర‌త‌న్ మోహిని అసలు పేరు పేరు ల‌క్ష్మీ. హైద‌రాబాద్‌, క‌రాచీ నుంచి ఆమె అంత‌ర్జాతీయ స్థాయిలో బ్రహ్మకుమారిస్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 1954లో జ‌పాన్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ పీస్ కాన్ఫరెన్స్‌లో బ్రహ్మకుమారీల తరపున పాల్గొన్నారు.