గడప గడపలో అలరిస్తున్న బోనాల పాట

 

బోనాల పండుగ అనగానే తెలంగాణ ప్రాంత ప్రజల మనస్సులు పులకరిస్తాయి. పురాణగాధలు, చారిత్రక సంఘటనలతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల ప్రజలు బంధుమిత్రుల కుటుంబాలతో కలిసి మెలిసి ఈ పండుగ జరుపుకుంటారు.బోనం అంటే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవిగుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేపరెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు)తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం జరుగుతుంది.

మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మొదలైన పేర్లు కల ఈ దేవిగుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు. ఇక బోనాలు ఏడాదికి ఒకసారి వస్తాయి.. బోనాల పాటలు ఏడాదంతా అలరిస్తాయి.. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా తెలంగాణ గడప గడపలో బోనాల పాటలు అలరిస్తాయి.. అలా మీ గడపలో అడుగుపెట్టి మిమ్మల్ని అలరించే మరో బోనాల పాట మీ ముందుకు వచ్చింది.. అద్భుతమైన ఈ బోనాల పాట వింటే పులకరించిపోతారు, ఆనందంతో కాలు కదుపుతారు.. చూసి తరించండి.