థాయ్‌లాండ్‌లో హైదరాబాద్ జంట మృతి

 

బంజారాహిల్స్‌కి చెందిన యువ దంపతులు థాయిలాండ్‌లో జరిగిన పడవ ప్రమాదంలో మరణించినట్టు సమాచారం అందింది. ఈ భార్యాభర్తలిద్దరూ పడవలో షికారు చేస్తూ వుండగా ఆ పడవ తిరగడబడటంతో ఇద్దరూ మునిగిపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పడవ నడిపే వ్యక్తి కూడా మరణించాడు. మరణించిన యువకుడు యువ పారిశ్రామికవేత్త అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి వుంది.