తెలంగాణాకు కట్టుబడని బిజెపి? అధికారం కోసమేనా అప్పుడు లొంగింది?

BJP Only Party, Demand For Seperate Telangana, Before NDA   Government, West Godavari District, Kakinada, BJP National   Conference, Promise, TDP Support, L.K. Advani, Samaikhyandra,

 

దేశంలోనే ప్రత్యేక తెలంగాణా డిమాండును ఆదరించిన పార్టీ బిజెపి. ఇది అంగీకరిస్తారు. ఎందుకంటే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాకమునుపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జాతీయ సమావేశాలను నిర్వహించుకుంది. ఆ సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణా ఇస్తామని ప్రకటించుకుంది. అనంతరం అధికారంలోకి ఎన్‌డిఎ కూటమి వచ్చింది. ఈ కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా చేరింది. ఆ పార్టీ మద్దతు వల్లే కేంద్రంలో అధికారం అనుభవించిన బిజెపి ఆ తరువాత ఎన్నికల్లోనే ఓటమి పాలైంది. జాతీయస్థాయి పార్టీ కాస్తా ప్రాంతీయపార్టీలతో పోటీపడే స్థాయికి చేరింది. ఇప్పుడు తాజాగా ఆ పార్టీ నేత లాల్‌కృష్ణ అద్వానీ అప్పట్లో తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చి ఉంటే తెలంగాణా ఇచ్చేసి ఉండేవారమంటున్నారు. అప్పట్లో తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అవసరమైతే తాము మద్దతు ఉపసంహరించుకుంటాం కానీ, తెలంగాణా ప్రత్యేకరాష్ట్రానికి మద్దతు ఇవ్వబోమని నిర్ణయాన్ని వెల్లడిరచింది. తాజాగా పెరిగిన ఒత్తిడులకు తెలుగుదేశం పార్టీ కొంత లొంగినమాట నిజమే. కానీ, ఇప్పటికీ సమైక్యతాభావనలను ఆ పార్టీ ప్రతిబింబింపజేస్తోంది. అందువల్ల అప్పట్లో అధికారం కోసం బిజెపి తమ తీర్మానాన్ని గాలికి వదిలేసింది. ఎక్కడ తెలుగుదేశం మద్దతు ఉపసంహరించుకుంటుందోనని అసలు ఆ రాష్ట్ర ప్రతిపాదనే పెట్టలేదు. అధికార కాలం ముగిశాక మళ్లీ నెపం మాత్రం తెలుగుదేశం పార్టీపైకి నెడుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu