బీజేపీ కమ్మేస్తోందా? కబళించేస్తోందా?
posted on Dec 3, 2024 1:51PM
కమల దళం రాను రానూ ఆ పార్టీ మౌలిక సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చేసి రాజకయ ప్రత్యర్థులను కబలించేయడం లక్ష్యంగా పెట్టుకుందా? రాష్ట్రాలలో అధికారం కోసం ఆ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలు, అమలు చేస్తున్న ఎత్తుగడలు చూస్తుంటే ఔనన్న సమాధానమే వస్తోంది. 2014 ఎన్నికలకు కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని ఇచ్చిన ఆ పార్టీ ఆ తరువాత సాగించిన ప్రస్థానాన్ని చూస్తుంటే దేశం మొత్తాన్ని కాషాయంతో నింపేయాలనీ, బీజేపీ జెండా యావద్దేశాన్ని కమ్మేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారాన్ని దక్కించుకోవడంతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలలో కాషాయ జెండాయే ఎగరాలన్నది ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది. ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలనుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టకు కానీ అందుకోసం విలువలకు పాతరేయడాన్ని, ప్రత్యర్థి పార్టీల ఉనికిని కూడా సహించలేని తత్వాన్ని మాత్రం ఎవరూ అంగీకరించజాలరు.
కాంగ్రెస్ ఆత్మస్థైర్యం దెబ్బతినేలా చేయడంలో బీజేపీ ఇప్పటికే విజయం సాధించింది. ఏదో అప్పడప్పుడు, అడపాదడపా ఒకటి రెండు ఎన్నికలలో విజయం సాధించడం వినా గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్ కు దక్కిందేమీ లేదు. ఆ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్టు అన్న చందంగా తయారౌతోంది. వారసత్వ రాజకీయాల పట్ల ప్రజలలో వైముఖ్యం, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, అధినాయకత్వం సీరియస్ రాజకీయాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆ పార్టీ దేశ రాజకీయాలలో ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఇటీవల జరిగిన హర్యానా,మహారాష్ట్ర ఎన్నికలో ఆ పార్టీ పెర్ఫార్మెన్స్ ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
వాస్తవానికి 1977 జనతా ప్రయోగం విఫలం అయిన తరువాత జనసంఘ్ పార్టీ తన రూపు మార్చుకుని రాజకీయాలలో బలంగా నిలదొక్కుకునేందుకు చేసిన ప్రయత్నం, 1980 దశకంలో ఆ పార్టీకి నేతలుగా వాజ్ పేయి, అద్వానీ వంటి వారి రాజకీయ సంకల్పం బీజేపీకి బలమైన పునాదులు వేశాయి. 1984 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ రికార్డ్ స్థాయిలో 400 మార్క్ అప్పట్లో బీజేపీ కేవలం రెండంటే రెండు స్థానాలతో లోక్ సభలో అడుగు పెట్టింది. అయితే 1989లో రామజన్మ భూమి నినాదంతో బీజేపీ పుంజుకుంది. ఆ ఎన్నికలలో 88 స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటింది.
1990 సెప్టెంబర్ లో బీజేపీ నేత అద్వానీ అయోధ్యకు రథయాత్ర ప్రారంభించారు. యూపీఏ,బీహార్లలో రథయాత్ర జరుగుతున్నది. లాలూ బీహార్ సీఎంగా ఉన్నారు. ఆయన అద్వానీని అరెస్ట్ చేయడంతో రథయాత్ర ముగిసింది. దాంతో విపీసింగ్ ప్రభుత్వానికి బయట నుంచి ఇస్తున్న మద్దతును బీజేపీ ఉపసంహరించుకుంది. దీంతో వీపీసీంగ్ ప్రభుత్వం కుప్పకూలి, కాంగ్రెస్ మద్దతుతో చరణ్ సింగ్ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే అదీ మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసింది. చరణ్ సింగ్ కు ఇచ్చినట్లే ఇచ్చిన మద్దతును కాంగ్రెస్ ఉపసంహరించుకోవడంతో 1991లో మధ్యంతర ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆ ఎన్నికలు తొలి దశ పూర్తై మలి దశ జరగడానికి ముందు రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురయ్యారు. ఆ సానుభూతి పవనాలు బలంగా వీచినా కూడా ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలిచినా సాధారణ మెజార్టీ రాలేదు. బీజేపీ బలం 88 నుంచి 120 స్థానాలకు పెరిగింది. పూర్తి మేజార్టీ లేకపోయినా పీవీ నరసింహారావు నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆర్ధిక మంత్రిగా పీవీ నరసింహరావు తీసుకున్న నిర్ణయాలు, ఆయన తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని గాడిలో పెట్టాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి దేశం బయటపడింది. మైనారిటీ ప్రభుత్వాన్ని పీవీ నరసింహరావు విజయవంతంగా ఐదేళ్లూ నడిపారు.
పీవీ హయాంలోనే 1992 లో యూపీలో బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు.దేశంలో అనేక విధ్వంసాలు చోటుచేసుకున్నాయి. బొంబాయి పేలుళ్లు కూడా ఆ సమయంలోనే జరిగాయి.1 996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. బాబ్రీ కూల్చివేత తో మైనార్టీలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేసారు. పార్టీ సోనియాగాంధీ సారధ్యంలోని వచ్చింది. హంగ్ పార్లమెంట్ ఏర్పడింది.కాంగ్రెస్ కు 140 సీట్లు వచ్చాయి.మొదటీ సారి కాంగ్రెస్ ఓటు షేర్ 30 శాతం కంటే తక్కువ వచ్చింది. వాజపేయి సారధ్యంలో బీజేపీ 161 స్థానాలు సాధించిన పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే వాజ్ పేయి ప్రభుత్వం కేవలం 13 రోజులకే కుప్పకూలింది. తరువాత యునైటెడ్ ఫ్రంట్ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. జనతాదళ్ కు చెందిన హెచ్ డి దేవెగౌడ ప్రధానమంత్రి అయ్యారు. ఆయన 1997 ఏప్రిల్ 21న రాజీనామా చేసారు.లాలూ దాణా కుంభకోణంలో చిక్కుకోవడం తో జనతాదళ్ నుంచి వీడి 17 మందితో రాష్ట్రీయ జనతాదళ్ ఏర్పాటు చేయడంతో గౌడ్ రాజీనామా చేసారు.1997 లో యునైటెడ్ ఫ్రంట్ నుంచే ఐ కే గుజ్రాల్ ప్రధాని అయ్యారు. 11 నెలలు పరిపాలించారు.కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో గుజ్రాల్ ప్రభుత్వం పడిపోయింది. అస్థిరత కారణంగా 1998లో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. బీజేపీ ఈ సారి 182 స్థానాలు సాధించి పెద్ద పార్టీ గా అవతరించింది. కాంగ్రెస్ కు 141 స్థానాలు వచ్చాయి.నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పేరు తో బీజేపీతో కొన్ని పార్టీలు కూటమి కట్టాయి.12 స్థానాలున్న తెలుగుదేశం పార్టీ బయటినుంచి మద్దతు ప్రకటించింది.
1994 డిసెంబర్లో ఉమ్మడి ఏపీ ఎన్నికల్లో 216294 స్థానాల్లో ఎన్టీఆర్ విజయం సాధించారు 1995లోఎన్టీఆర్ పార్టీలో తిరుగుబాటు జరిగి చంద్రబాబు సీఎం అయ్యారు. కేంద్రంలో వాజపేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం 13 నెలలు అధికారంలో ఉంది.ఏప్రిల్1999లో18 స్థానాలున్న అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత తమిళనాడు లోని డిఎంకే ప్రభుత్వం బర్తరఫ్ చేయమని డిమాండ్ చేయడంతో వాజపేయి తిరస్కరించారు. దాంతో జయ మద్దతు ఉపసంహరించుకోవడంతో వాజపేయిపై అవిశ్వాసం ఒక్క ఓటు తేడాతో గెలిచి ప్రభుత్వం కూలిపోయింది.1999 సెప్టెంబర్-అక్టోబర్ లలో మళ్లీ సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. 1999లో వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. ఏపీ సీఎం చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నారు.ఐదేళ్లూ వాజపేయి ప్రధానిగా కొనసాగారు.1984 తరువాత మొదటి సారి ఐదేళ్లూ వాజపేయి ప్రభుత్వం అధికారంలో కొనసాగింది. 2004 నాటికి సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పుంజుకుంది. భారత్ వెలిగిపోతున్నదనే నినాదంతో వాజపేయి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లి చతికిల పడింది. 2004లో కాంగ్రెస్ విజయం సాధించింది. విదేశీయురాలనే ఆరోపణతో ప్రతిపక్షాలు ఆమెను ప్రధాని అభ్యర్ధిగా ఒప్పుకోమని పట్టుబట్టాయి.దాంతో పీవీ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా చేసిన మన్మోహన్ సింగ్ ను సోనియా గాంధీ ప్రధానిని చేసారు.ఆయన రెండు సార్లు ప్రధానిగా చేసినా రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారు.
2014 ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విజయం సాధించడం ప్రధానిగా మోడీ అధికార పగ్గాలు చేపట్టడంతో బీజేపీ ప్రస్థానంలో స్పష్టమైన మార్పు మొదలైంది. మౌలిక సిద్ధాంతాలను పట్టుకుని వేలాడకుండా.. అధికారంలో కొనసాగడం కోసం ప్రత్యర్థి పార్టీలను బలహీనం చేయడం అన్న పంథాకు మోడీ పెద్ద పీట వేయడంతో ఆయన వరుసగా రెండు సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకురాగలిగారు. ఆ రెండు సార్లూ కూడా మోడీది పేరుకు మాత్రమే సంకీర్ణ ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం అది బీజేపీ కాదు కాదు మోడీ సర్కార్ గానే మనుగడ సాగించింది. అందుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని నడిపే బలం ఏ రెండు సార్లూ కూడా బీజేపీకి దక్కడమే. ఇక 2024లో కూడా మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కొలువుదీరిగా.. ఈసారి బీజేపీకి జనం పూర్తి బలాన్ని ఇవ్వలేదు. దీంతో అనివార్యంగా సంకీర్ణ ధర్మాన్ని పాటించక తప్పని పరిస్థితుల్లో మోడీ పడ్డారు. అయితే మోడీ సర్కార్ వేస్తున్న అడుగులను నిశితంగా గమనిస్తే.. ప్రత్యర్థి పార్టీలనే కాదు, మిత్రపక్షాలను కూడా బలహీనం చేయడమనే వ్యూహాన్ని బీజేపీ అనుసరిస్తోందని చెప్పక తప్పదు. ముందు ముందు రోజులలో బీజేపీ మిత్రపక్షాలలో చీలికలు అనివార్యమని మహారాష్ట్రను ఉదాహరణగా చూపుతూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.