పొరపాటున తాళి కట్టబోయిన సుబ్రహ్మణ్యస్వామి

బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి ఓ విచిత్రమైన పని చేసి అందరూ షాక్ అయ్యేలా చేశారు. సుబ్రమణ్యస్వామి తమిళనాడులోని తిరునల్వెలిలో ఓ పెళ్లికి హాజరయ్యారు. అయితే తాళిబొట్టును తన చేతుల మీదుగా వరుడికి అందించవలసిందిగా పెద్దలు కోరడంతో సుబ్రమణ్యస్వామి అందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో పరధాన్యంలో ఉన్న ఆయన తాళిబొట్టును వరుడికి అందిచకుండా ఏకంగా పెళ్లి కూతురి మెడలో కట్టబోయాడు. దీంతో పెళ్లి పందిరిలో ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాక కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయారు. ఇంతలో అక్కడ ఓ పెద్దావిడ తేరుకొని మంగళసూత్రం కట్టకుండా ఆయనను ఆపింది. సుబ్రమ్మణ్యస్వామి మాత్రం తను చేసిన పనికి కాస్త సిగ్గుపడి నవ్వుకుంటూ వెళ్లిపోయారు.