బీసీ హాస్టల్ లో విద్యార్థులతో వెట్టి చాకిరీ
posted on Apr 11, 2023 12:42PM
బీసీ గురుకుల విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. వారి ఆత్మ గౌరవానికి భంగం కలిగే విధంగా పనులు చేయిస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు బాపులే బీసీ గురుకుల హాస్టల్ లో విద్యార్థుల చేత పనులు చేయిస్తున్నారు. సమయం అంటే లేకుండా ఆ హాస్టల్ లో విద్యార్థుల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.
హాస్టల్ విద్యార్థుల చేత వార్డెన్ కిచెన్ క్లీనింగ్, వంట చేయించడం, అలాగే చెత్తను తొలగించడం తదితర పనులు చేయిస్తున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. అంతే కాకుండా ఉపధ్యాయులు కూడా విద్యార్థులతో సొంత పనులు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి.
హాస్టల్ లో ఉన్నంత మాత్రాన వారు పనిపిల్లలు కాదనీ, చదువుకోవాల్సిన విద్యార్థుల చేత పని చేయించడం ఏమిటని నెటిజన్లు మండి పడుతున్నారు. ఇప్పటికైనా విద్యార్థుల చేత పని చేయిస్తున్న హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయిస్తునారు.