సోనియాగాంధీ ఇంటి వద్ద ఉద్రిక్తత.. ఇంటిని ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు..
posted on May 30, 2016 12:18PM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ రోజు ఉదయం బీజేపీ నేతలు సోనియా ఇంటిని ముట్టడించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాట్లా ఎన్‌కౌంటర్‌పై కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు. అయితే ముందుస్తు సమాచారం లేకుండా వందలాది మంది కార్యకర్తలు సోనియా ఇంటిముందు నిరసనకు దిగడంతో పోలీసులు ఖంగుతిన్నారు. అనంతరం.. రంగంలోకి దిగి ఆందోళన కారులపై లాఠీఛార్జ్ చేశారు. అంతేకాదు వాటర్ కేనన్లను రంగంలోకి దింపారు. బీజేపీ కార్యకర్తలపై వాటర్ కేనన్లు ప్రయోగించిన పోలీసులు ఎట్టకేలకు వారిని సోనియా నివాసం సమీపంలోకి రాకుండా అడ్డుకోగలిగారు.