అక్కడ పనికిరాని వ్యక్తికి ఇక్కడేం పని.. పవన్ పై బాల్క సుమన్ సంచలన కామెంట్స్
posted on Nov 21, 2020 2:39PM
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ శక్తియుక్తులన్నింటినీ ఒడ్డి పోరాడుతున్నాయి. ఈసారి బల్దియాపై తామే జెండా ఎగరేయాలనే లక్ష్యంగా చెమటోడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తొలుత ఒంటరిగా పోటీ చేస్తామన్న జనసేన.. బీజేపీ నేతల భేటీ తరువాత జీజేపీకి తాను పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వపన్ కల్యాణ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "పక్క రాష్ట్రంలో దేనికీ పనికి రాని వ్యక్తికి హైదరాబాద్ రాజకీయాలతో ఏం పనో " అంటూ బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా "ఏపీలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ..ఇక్కడ పోటీకి దిగుతాననడం జోక్‌గా ఉందంటూ" ఎద్దేవా చేసారు. అంతేకాకుండా "పక్క రాష్ట్రంలో ఏమీ చేయలేనోడు ఇక్కడ ఏం చేస్తాడంటూ" కామెంట్ చేశారు. పవన్ మాటలు విని జనాలు నవ్వుకుంటున్నారంటూ సుమన్ ఎద్దేవా చేశారు.