పి.వి.సింధు ద విన్నర్

 

తెలుగు బ్యాడ్మింటన్ సంచలనం పి.వి.సింధు ఈ సంవత్సరానికి తన విజయయాత్రని ఒక విజయంతో ముగించింది. మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్‌ను సింధు నిలబెట్టుకుంది. ఆదివారం జరిగిన మహిళల ఫైనల్‌లో ఈ తెలుగు తేజం 21-12, 21-17 తేడాతో కిమ్ హ్యో మిన్ (దక్షిణ కొరియా)ను ఓడించింది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధు ఫైనల్‌లో కిమ్ నుంచి గట్టిపోటీని ఎదుర్కొంది. ప్రస్తుతం సింధు చేతిలో ఓటమి పాలైన కిమ్ ఫైనల్‌లో సింధును తీవ్రంగానే ప్రతిఘటించింది. అయితే, పీవీ సింధు చక్కటి ప్లేసింగ్స్, స్మాష్‌లతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, వరుస సెట్లలో ఘన విజయాన్ని నమోదు చేసింది.