శిశువుల విక్రయ ముఠా అరెస్టు

 ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన పసిపిల్లలను బెజవాడలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.  ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి నెలల వయస్సు చిన్నారులను తీసుకువచ్చి ఈ ముఠా విజయవాడ కేంద్రంగా విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ముఠా ఒక్కో శిశువునూ మూడున్నర నుంచి ఐదులక్షల రూపాయలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠాకు చెందిన ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులను  పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న ఐదుగురు శిశువులను ఐసీడీఎస్‌కు తరచి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu