అనేక యుద్ధముల ఆరితేరిన మూర్తి..స్పూర్తి చంద్రబాబు!

రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ చంద్రబాబు గొప్ప స్థాయి  ఉన్న నాయకుడు. రాజకీయానుభవం కానీ, పరిపాలనా అనుభవం కానీ దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేదు. ప్రజల పట్ల అంకితభావం, కష్టపడే తత్వం ఆయనకే వుంది. చంద్రబాబుకి అవినీతి మకిల అంటించాలని రాజకీయ ప్రత్యర్ధులు చాలా మంది కోర్టుల్లో కేసులు వేసి ఆయాస పడ్డారే తప్ప అవినీతిని నిరూపించలేక పోయారు. ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఎవరెన్ని కేసులు వేసినా ఆయన నిస్వార్ధ గుండె బెదర లేదు. విలువలుతో కూడిన రాజకీయాలు, సుపరిపాలన, జవాబుదారీతనం ఆయనకి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. తాము అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. కాబటి ఎదుటి వారిని మాత్రం ఎందుకు వదిలి పెట్టాలన్న దురుద్దేశ్యంతో  రాజకీయ ప్రత్యర్ధి అయిన చంద్రబాబుని అవినీతి పరుడుగా చిత్రించడం కోసం ఆధారాలు లేని అక్రమకేసు పెట్టి అరెస్టు చేసి వేధిస్తున్న వాస్తవాలు ప్రజలు గుర్తించాలి. 

కేవలం కక్ష సాధించడం కోసం అధికారాన్ని ఉపయోగించి ఆధారాలు లేక పోయినా అక్రమంగా అరెస్టు చేశారని, ఏ తప్పు చెయ్యక పోయినా పెద్ద శిక్ష వేశారని, జైలులో ఉంచి మానసిక క్షోభకు గురి చేశారని ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు, కుట్రలు, కేసులు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన నాయకుడుపై అభియోగం మోపే టప్పుడు అందుకు తగ్గ విశ్వసనీయ ఆధారాలు చూపకకుండా పోలీసులు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు మేరకు చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు కల్పితమైన కేసు అని మేధావులు, వివిధ రాజకీయ పక్షాలు, బాహాటంగా ప్రకటించాయి. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో రెండేళ్ల కిందట కేసు పెట్టారు. 

చంద్రబాబును అరెస్టు చేసి 16 రోజులు అవుతున్నా అయన తప్పు చేసినట్లు ఆధారాలు చూపలేక అవస్థలు పడుతున్నారు సిఐడి వారు. చంద్రబాబును ఎక్కడ తప్పు పట్టాలో తెలియక, ఏ ప్రశ్నలు అడగాలో అర్ధకాక ఫైళ్లు చూసుకొంటున్నారు సిఐడి అధికారులు. దీనిని బట్టి ఈ కేసు ఎంత కుట్ర పూరితమైనదో అర్ధం అవుతుంది. ఏ తప్పు చేయకుండా చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలలో 45 ఏళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. బలహీనతలతో తలదించి ఎరుగని, ఎవరి కాళ్ళకు మొక్కని నాయకుడు. ప్రజలు తలఎత్తుకొనేలా పాలించి, అందరి కోసం ఒక్కడై అహర్నిశలు చెమడోడుస్తున్న నాయకుడు ఆయన .ఆంధ్రాభ్యుదయం కోరి అవమానాలు భరిస్తున్న నాయకుడు. కఠోర శ్రమ, అకుంటిత దీక్షకు చెరగని చిరునామా చంద్రబాబు. ప్రజల కోసం రెక్కలు ముక్కలు చేసుకొనే శ్రామికుడు. గాంధీజి ఆశయాలను ఆలంబనగా చేసుకొని ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన అరుదైన నాయకుడు చంద్రబాబు. ఎన్‌టిఆర్... తెలుగువారి ఆత్మ గౌరవ చిహ్నం అయితే, చంద్రబాబు తెలుగువారి ఆత్మ విశ్వాస ప్రతీకగా నిలిచారు. తెలుగు ప్రజల ఉద్దరణ కోసం నిరంతరం కృషి చేస్తున్న మహర్షి చంద్రబాబు. తెలుగు ప్రజలను ప్రగతి పధం వైపు నడిపించే సమర్ధ నాయకుడు. ఎదురు దెబ్బలు..పాఠాలుగా, గాయాలు.. గుణపాఠాలుగా, సమస్యలను,సంక్షోభాలను సానుకూల అవకాశాలుగా మార్చుకొన్న ఆసిధారా వ్రతుడు, గెలుపోటములకు పొంగి, కృంగిపోని స్థిత ప్రజ్ఞుడు, అవిరామ యోధుడు, అలుపెరుగని ధీరుడు చంద్రబాబు.
                      
అతడే ఒక సైన్యం, అతడే ఒక స్ఫూర్తి. నేటి తరానికి ఆయనొక మార్గదర్శి. సరికొత్త లక్ష్యాల తీరాల వెంట ఎగిరే విహంగం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుగుజాతికి అందించిన దార్శనికుడు. జాతి నిర్మాణం వైపు ప్రజల్ని జాగృతం చేసిన నేత. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో జయాపజయాలు, మరెన్నో ఆటుపోట్లు చవిచూసినా చెక్కు చెదరని గుండె నిబ్బరం. మనోధైర్యం చంద్రబాబు సొంతం. నాలుగున్నర దశాబ్దాలుగా తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన నాయకుడు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలను ఒంట పట్టించుకుని అతి  చిన్న వయసులోనే మంత్రి, ముఖ్యమంత్రిగా పదవులు అధిరోహించి చరిత్ర సృష్టించారు. అన్ని రాజకీయ పక్షాల వైఖరికి భిన్నంగా పరిపాలన చేసి తన విజన్‌తో అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు చంద్రబాబు. మీ రాజకీయ అనిభవం, మార్గదర్శకత్వం పట్ల ఆకర్షితులవుతున్నాం, మీరు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాక, ఇండియాకి మార్గదర్శకులౌతారని యు,జి.కి కాకు కన్సల్ జనరల్ జపాన్ అన్నారు.  

                  
దేశంలోనే ఇంత అనుభవం ఉండి క్రియాశీలంగా ఉన్న నాయకులు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, విభజిత నవ్యాంధ్రను ఎక్కువ కాలం పాలించిన ముఖ్యమంత్రిగా,  ప్రతిపక్ష నాయకుడిగా నిలిచారు. ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం, విశ్వాసమే విభజన తరువాత ఆంధ్ర రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచారు. క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల చంద్రబాబు పోరాట పటిమ అసాధారణ మైనది. అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కొద్దిమందిలో చంద్రబాబునాయుడు ఒకరు.

1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని అనతి కాలంలోనే ఘన విజయాలను సాధించారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన తదితర కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. సీఎం అంటే ప్రజలందరికీ చిరపరిచితంగా ఉంటారనే ధోరణి తెచ్చింది చంద్రబాబే. ఆయన 9 ఏళ్ళ కాలంలో ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధికి చిరునామాగా మారారు. వినూత్న ఆలోచనలతో దార్శనికత ప్రదర్శించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఆధునీకరించారు. ఐటీ, బీటీ రంగాలను ప్రోత్సహించి హైదరాబాద్‌ను అంతర్జాతీయ పటంలో అగ్రగామిగా నిలిపారు. గతంలో చాలామంది భారతీయ రాజకీయ వేత్తలను కలుసుకొన్నాను కానీ, ఆచరణాత్మకమైన, దృఢమైన, పారదర్శక కార్యక్రమాలను అమలు చేసిన మీలాంటి వారిని కలుసుకోవడం నూతన ఉత్తేజం అన్నారు కేన్నత్, మెంబర్ హౌస్ ఆఫ్ లార్డ్స్ యు.కె 

రాష్ట్రపతులను, ప్రధానమంత్రులను ఎంపిక చేసిన ఘనత చంద్రబాబుది. యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా చంద్రబాబు వ్యవహరించి దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్‌లను ప్రధానులుగా చేయడంలో కీలక భాగస్వామిగా ఉన్నారు. 1999లో వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డియే ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. లౌకిక వాదానికి కట్టుబడి బయట నుంచి షరతులతో కూడిన మద్దతు ఇచ్చారు. ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేయటంలో తన వంతు పాత్ర నిర్వహించారు. 

దళిత నేత జిఎంసి బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా చేశారు. స్వర్జ చతుర్భుజి కింద ఫోర్‌ లైన్‌ రోడ్లు నిర్మించడానికి ఆధ్యుడిగా నిలిచారు. ఐటీ రంగం అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయంలో చంద్రబాబునాయుడు దూరదృష్టితో ఆలోచించి ఆ రంగాన్ని రాష్ట్రానికి తీసుకువచ్చి హైటెక్ సిటీ, సైబరాబాద్‌ను నిర్మించారు. ఆయన సాంకేతిక విద్యారంగంలో తెచ్చిన విఫ్లవాత్మకమైన మార్పుల కారణంగా లక్షలాది మంది తెలుగువారు దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. దీనివల్ల దేశానికి విదేశీమారక ద్రవ్యం పెద్దఎత్తున వస్తోంది. రాష్ట్రంలో సైతం యువతకు కళ్లు చెదిరే జీతాలొచ్చాయి. రైతు బిడ్డలను రత్నాలుగా మార్చారు. మారుమూల గ్రామాలకు కూడా ఐటీ రంగాన్ని పరిచయం చేశారు. భారత జాతికి మార్గదర్శకులుగానే కాక మిత్ర దేశాల స్నేహ సంబంధాలకు దోహద పడే సమర్ధవంతమైన భారత ప్రధాన మంత్రికాగల నేతను మీలో చూస్తున్నాం అన్నారు.[రవి కరుణ నాయకే ,మెంబర్ ఆఫ్ పార్లమెంట్, శ్రీలంక]

అధికారపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల పక్షాన నిలిచారు. నిరంతరం ప్రజల సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే. వస్తున్నా మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా పర్యటించారు. ఇంటి పెద్ద సమర్ధుడైతే ఆ కుటుంబం అన్ని విధాలా ముందంజ వేస్తుంది. అలాగే సమర్థవంతమైన నాయకుడుంటే ఆ ప్రాంతం, ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. పట్టుదల, సేవాతత్వం వంటి లక్షణాలతో అత్యున్నతమైన నాయకుడిగా చంద్రబాబునాయుడు ఎదిగారు. రాష్ట్ర విభజనతో తెలుగుజాతి ప్రాభవం జాతీయ స్థాయిలో తగ్గింది. మళ్లీ తెలుగుజాతికి పూర్వవైభవం తీసుకొచ్చే నాయకుడు ఎవరంటే ప్రజలకు మొదట గుర్తుకొచ్చింది చంద్రబాబునాయుడే. ఆయన ఆలోచనలు, దార్శనికతే మనలను ఖండాంతరాలకు తీసుకెళ్లింది. దావోస్ సదస్సులకు గడ్డ కట్టే చలిలో కూడా వెళ్ళి పలువురు దేశాధినేతలను కలుసుకొంటు పెట్టుబడులు పెడతారో లేదో తెలియక పోయినా వాళ్ళకు ప్రజెంటేషన్లు ఇస్తూ ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్‌ని పరిచయం చేసిన నాయకుడు చంద్రబాబు. మీ గొప్ప మార్గదర్శక స్పూర్తికి ప్రతి సమావేశంలోనూ మరీ ముగ్దుడనౌతుంటాను అన్నారుఎస్.ఐ గూచ్ హై కమీషనర్,కెనడా. భారతదేశ రాజకీయ నాయకులేవరికి దక్కని గుర్తింపు, అంతర్జాతీయ ప్రశంసలు పొందారు చంద్రబాబు. అటువంటి గొప్ప నాయకుడిపై తప్పుడు కేసుపెట్టి ఆనందిస్తూ క్యారెక్టర్ లేని గాలి మంద గాలి మాటలు మాట్లాడుతున్నారు.

చంద్రబాబు సమర్ధత, నమ్మకంతో 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. ఒకవైపు రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌, మరోవైపు రాజధాని లేదు. అయినా మొక్కవోని దీక్షతో బస్సులో నుంచే పాలన సాగించారు. 22 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటుతో పాలన మొదలుపెట్టి కేవలం 5 ఏళ్లల్లో దేశంలో ఎక్కడా అమలుకాని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. ప్రజా రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేశారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో దీనినొక కేసు స్టడీగా తీసుకున్నారు. నీతి ఆయోగ్ కూడా భూసమీకరణ విధానాన్ని అభినందించింది. పోలవరాన్ని రికార్డు సమయంలో 70% నిర్మించారు. పట్టిసీమ ద్వారా 40 వేల కోట్ల విలువైన పంటను కాపాడారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా ఉపశమనం, ఫైబర్‌గ్రిడ్‌ వంటి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. తన మేధస్సు, అపార అనుభవాన్ని ఉపయోగించి దేశ, దేశాలు తిరిగి విదేశీ పెట్టుబడులు ఆహ్వానించారు.  ఆంధ్రప్రదేశ్‌ను శ్రేయోదాయక అభివృద్ది దిశగా నడిపించేందుకు చంద్రబాబు తనను తాను ఆంధ్రప్రదేశ్‌కి సమర్పించుకొన్నారని చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానంలోకి వచ్చినా పట్టువదలని విక్రమార్కుడిలా గడిచిన నాలుగున్నరేళ్లుగా  ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలపై గాంధేయ మార్గంలో ఏడు పదులు దాటిన వయస్సు లోనూ  ప్రజల కోసం అలుపెరుగని  పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తన వయసును, ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా నిత్యం ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుండి ఎన్నో సంక్షోభాలు, ఎన్నో కుట్రలు, ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న పార్టీని దెబ్బతీయడానికి అనేక పార్టీలు, వ్యక్తులు చెయ్యని ప్రయత్నం లేదు. తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేస్తామని ప్రగల్బాలు పలికిన వారే ఫినిష్ అయ్యారు. అక్రమ కేసు పెట్టి చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దామని కలలు కంటున్న జగత్ కిలాడీకి  ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టబోతున్నారు. మరొక ఆరు నెలల్లో తాడేపల్లి ఏడుపుల పల్లిగా మిగలబోతుంది.

ఏ సమాజంలో అయితే నీతి తప్పిన అవినీతి పరులు విజయం సాధిస్తారో, ఏ సమాజంలో అయితే నేరస్థులు పూజింబడతారో, ఏ సమాజంలో అయితే విలువలు పతనమై అవకాశవాదం రాజ్యమేలుతుందో, ఏ సమాజంలో అయితే అవినీతి విలయతాండవం చేస్తున్నా పట్టించుకోకుండా ప్రజలు తమకు రావాల్సిన వాటాల కోసం అర్రులు చాస్తారో ఆ సమాజం పున:సమీక్షించుకునే సమయం అసన్నమైందని ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త రాబర్ట్ క్లిట్ గార్డ్ వ్యాఖ్యలు ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌కు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఈ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు నాయకత్వం, ఆవశ్యకతను ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి. అమృతం లభించే వరకు పాల సముద్రాన్ని మధిస్తూ వెళ్లడమే కార్యసాధకుల లక్షణం. ఆ కోవకు చెందిన వారే చంద్రబాబు నాయుడు కూడా. నిర్వరామ శ్రామికుడు అలుపెరుగని పోరాట యోదుడు, దేశం గర్వించదగిన ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు,  అటువంటి నాయకుడిని ఎటువంటి ఆధారాలు చూపకుండా కక్షతో అక్రమ కేసుపెట్టి వేదిస్తున్నది జగన్ ప్రభుత్వం. అటువంటి నాయకుడుని కాపాడుకోవాల్సింది ఆంధ్రులే. మరోసారి తప్పటడుగు వేస్తే ఆంధ్రులకు అధోగతే. 

 

                                                                                నీరుకొండ ప్రసాద్ 
  సీనియర్ జర్నలిస్ట్