మూడోపెళ్ళి చేసుకోలేదు దేవుడోయ్... అజార్...
posted on Dec 22, 2015 9:30AM

మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ అజారుద్దీన్ తన స్నేహితురాలు షనోన్ మేరీని మూడో వివాహం చేసుకున్నాడని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన అజార్ ముచ్చటగా మూడోపెళ్ళి చేసుకున్నాడంటూ వచ్చిన వార్తలను అజారుద్దీన్ ఒక ప్రకటనలో ఖండించాడు. తాను షనోమ్ మేరీతో సన్నిహితంగా వున్నంతమాత్రాన ఆమెను పెళ్ళి చేసేసుకున్నట్టు వార్తలు ఇవ్వడమేంటని అజారుద్దీన్ ఆ ప్రకటనలో మండిపడ్డాడు. వార్తలు రాసేముందు ఆ విషయాన్ని నిర్ధారించుకుని వుంటే బావుండేదని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. అమెరికాకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ షనోమ్ మేరీ ఢిల్లీలో స్థిరపడింది. ఆమెతో అజారుద్దీన్ ఇటీవల చాలా క్లోజ్‌గా కనిపిస్తున్నాడు. లండన్ వీధుల్లో ఎక్కడ చూసినా వీరిద్దరే కనిపిస్తున్నారు. మరి అంత క్లోజ్‌గా కనిపించడం వల్ల పెళ్ళయిపోయిందని మీడియా అపోహ పడివుండొచ్చు. పెళ్ళి అని కాకుండా షనోమ్ మేరీతో అజారుద్దీన్ సహజీవనం అని న్యూస్ ఇచ్చి వుంటే అజార్ భాయ్ ఫీలయ్యేవాడు కాదేమో!