మకరజ్యోతి దర్శనంతో పులకించిన అయ్యప్ప భక్తులు

లక్షలాదిమంది అయ్యప్ప భక్తులు  శబరిమలలో మకర జ్యోతి దర్శనం చేసుకుని భక్తి పారవశ్యంతో పులకించారు.  శబరిమల గిరులు స్వామియే శరణం అయ్యప్ప అన్న నామస్మరణతో హోరెత్తాయి.

ప్రతి ఏటా జనవరి 14వ తేదీ సాయంత్రం మూడు సార్లు మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా దర్శనానికి రాని భక్తులు ఈ ఏడాది పోటెత్తడంతో శబరి గిరులు ఈ ఏడాది భక్తుల రద్దీతో కిటకిటలాడాయి.

పొన్నాంబళంలోని స్వామి దర్శనానికి అయ్యప్ప మాలధారులు గంటల తరబడి క్యూలైన్లలో వేచిచూడాల్సి వస్తోంది. వణికిస్తున్న చలికి సైతం లెక్కచేయకుండా అయ్యప్ప భక్తులు శబరిమలకు పోటెత్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu