విజయమ్మకు అవినాష్ బెదరింపు?.. నిజమేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సొంత బాబాయ్ వైఎస్  వివేకా హత్య కేసులో ఇటీవల చోటు చేసుకున్న  కీలక పరిణామాలు పులివెందులలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపాయి. హతుడు వివేకాపై కడప ఎంపీ   అవినాష్ రెడ్డి,  ఆయన తండ్రి  భాస్కరరెడ్డి చేసిన ఆరోపణలపై పులివెందులలోనే కాకుండా కడప జిల్లా వ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం  అవుతున్నాయి.

అయితే ఈ వ్యాఖ్యలపై వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరూ నోరు మెదకపక పోడం, ఖండించకపోవడంపై వైఎస్ కుటుంబీకుల పట్ల ప్రజలలో ఇప్పటి వరకూ ఉన్న గౌరవాన్ని మసకబారుస్తోందని పరిశీలకులు అంటున్నారు. అఖరికీ వైఎస్ సతీమణి, వైపీపీ మాజీ గౌరవ అధ్యక్షురాలు  విజయమ్మ కానీ.. ఆమె కుమార్తె ,వెఎస్సార్ టీపీ  అధ్యక్షురాలు  షర్మిలసైతం మౌనంగా ఉండడం పట్ల ఉమ్మడి కడప జిల్లా ప్రజలలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.  రాజకీయాల్లో విమర్శలు ప్రతీ విమర్శలు సహజమని...  కానీ తన సొంత మరిది   వివేకాపై సొంత వాళ్లే..  ఇంత దారుణంగా... అవమానకరంగా ఆరోపణలు చేస్తుంటే.. వీళ్లు మౌనంగా ఉండడం ఏమిటని వారు బల్లగుద్ది మరీ ప్రశ్నిస్తున్నారు. 

అయినా ఏమాటకామాటే చెప్పాలని.. వైయస్ వివేకా హత్య కేసు ఒకానొక దశలో ముందుకు సాగకుండా.. ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటే.. అలాంటి సమయంలో  షర్మిల.. నేరుగా ఢిల్లీకి వెళ్లి.. సీబీఐ కేంద్ర కార్యాలయంలో.. తన సొంత చిన్నాన్న హత్య కేసులో వాంగ్మూలం ఇవ్వడమే కాకుండా.. ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాలంటూ అదే సీబీఐ కార్యాలయం ఎదుటే  మీడియా ముందు తన అభిప్రాయన్ని  కుండ బద్దలు కొట్టిందని కడప జిల్లా వాసులు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. మరో వైపు పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీని స్థాపించి.. ప్రజలతోపాటు  నిరుద్యోగుల కోసం దీక్షలు చేపట్టడమే కాకుండా.. ప్రజా సమస్యలపై పాదయాత్ర కూడా చేపట్టి కేసీఆర్ ప్రభుత్వం చేపడుతోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై తనదైన శైలిలో గళమెత్తి పోరాటం చేస్తున్న షర్మిల సొంత బాబాయ్ పై అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డిలు వేసిన నిందలను ఖండించకపోవడమేమిటని కడప జిల్లా వాసులు అంటున్నారు.

 అదీకాక.. ఈ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి తొలిసారి సీబిఐ విచారణకు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా  స్వయంగా లోటస్‌పాండ్‌కు  వెళ్లి.. విజయమ్మతో భేటీ అయిన తరువాతే కోఠిలోని సీబీఐ కార్యాలయంలో జరిగిన విచారణకు హాజరయ్యారని వారు గుర్తు చేస్తున్నారు. అయితే అప్పట్లో ఈ   భేటీపై అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో   విభిన్న కథనాలు అయితే వెల్లువెత్తాయి. ఆ క్రమంలో వైయస్ విజయమ్మను వైయస్ అవినాష్‌రెడ్డి బెదిరించారంటూ ప్రచారం కూడా జరిగింది. దీంతో మరోసారి సీబీఐ విచారణకు హైదరాబాద్ వచ్చిన  అవినాష్ రెడ్డి.. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ... తాను వైయస్ విజయమ్మ నుంచి ఆశీర్వాదం తీసుకోవడం కోసం.. లోటస్‌పాండ్‌కు వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. 

 మరి ఆ సమయంలో విజయమ్మ  తండ్రి తర్వాత తండ్రి అంతటి వారు  వివేకా . ఆయనపై అటువంటి ఆరోపణలు చేయడం తప్పు అంటూ కడప ఎంపీకి ఎందుకు చెప్పలేదని అంటున్నారు. వైఎస్ వివేకాపై అవినాష్, ఆయన తండ్రి ఆరోపణలను విజయమ్మ ఖండించకపోవడంతో అవినాష్ లోటస్ పాండ్ కు వెళ్లిన సందర్భంగావ ిజయమ్మను బెదరించి ఉంటారనీ,  అందుకే ఆమె సైలెంట్‌గా ఉన్నారన్న అభిప్రాయం కడప జిల్లా వాసులలో వ్యక్తమౌతోంది.  ఈ అభిప్రాయాన్ని బలపరిచే విధంగా   కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రరెడ్డి ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో   వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిలలు డేంజర్‌లో ఉన్నారని.. వారు జాగ్రత్తగా ఉండాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu