ది శాటానిక్ వర్సెస్ రచయత సల్మాన్ రష్దీపై దాడి

ప్రముఖ రచయత సల్మాన్ రష్దీపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ‘ది శాటనిక్ వర్సెస్’ పుస్తకం వివాదాస్పదమైంది. సల్మాన్ రష్దీ దైవ దూషణ చేశారంటూ ముస్లింలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ ఆయనపై ఫత్వా విధించింది. రష్దీని  ఖతం చేసిన వారికి  3 మిలియన్ డాల్లర్లు నజరానా ప్రకటిస్తూ ఇరాన్ నజరానా ప్రకటించింది. ముస్లింల నుంచి బెదరింపులు ఎదుర్కొంటున్న రష్దీపై న్యూయార్క్ లో దాడి జరిగింది.

న్యూయార్క్ లోని ఒక విద్యా సంస్థలో ఆయన ప్రసంగించబోతుండగా ప్రేక్షకుల్లోంచి వేదికపైకి దూసుకు వచ్చిన ఒక అగంతకుడు ఆయనపై దాడికి పాల్పడ్డాడు.  భారత సంతతికి చెందిన రష్దీ  ముంబైలో 1947లో రష్దీ జన్మించారు. ఆ తరువాతి కాలంలో బ్రిటన్ కు తరలి వెళ్లారు. 1981లో ఆయన రాసిన మిడ్ నైట్ చిల్డ్రన్ పుస్తకానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంలు లభించాయి.  ఆ తరువాత 1988లో ఆయన రచించిన ‘ది శైటానిక్ వర్సెస్’ వివాదాస్పదమైంది.

పలు ఇస్లామిక్ సంస్థలు ఆయన పై మండి పడ్డాయి. ఆయనను హత్య చేస్తామంటూ బెదరింపులు కూడా వచ్చాయి. ఇరాన్ అయితే తమ దేశంలో దిశాటినిక్ వర్సెస్ పుస్తకాన్ని నిషేధించడమే కాకుండా రష్దీ పై ఫత్వా కూడా విధించింది. దీంతో ఆయన దాదాపు దశాబ్దం పాటు పూర్తిగా ఆజ్ణాతంలో ఉన్నారు.

ఆయన  ఎక్కడ ఉంటున్నదీ కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియనీయలేదు. ఈ నేపథ్యంలోనే ఆయనపై న్యూయార్క్ లో దాడి జరిగింది. వేదికపైకి దూసుకు వచ్చిన అగంతకుడు కత్తితో ఆయన మెడపై పొడిచాడు.  వెంటనే ఆయన కుప్పకూలిపోయారు. దాడికి పాల్పడిన అగంతకుడిని వేదికపై ఉన్న వారు పట్టుకున్నారు. కుప్పకూలిన రష్దీని హుటాహుటిన హెలికాప్టర్ లో ఆస్పత్రికి తరలించారు.