బ‌రితెగించిన ఢిల్లీ మెట్రో

భార‌త‌దేశం అన‌గానే అనేక సామాజిక క‌ట్టుబాట్లు, సంప్ర‌దాయాల పుట్టిల్లుగా ప్ర‌తీతి. మ‌హిళ‌ల‌ను గౌర‌వించే దేశంగా ప్ర‌సిద్ధి. వారిని అవ‌హేళ‌న చేస్తూ ఎలాంటి ప్ర‌చారాలు, సంభాష‌ణ జ‌ర‌గ‌నీయ‌ని దేశం. ఇంత‌టి  నిషేధాల సమాజంలో నిజానికి  సెక్స్ అండ్ సెక్సువాలిటీ గురించి బహిరంగంగా చర్చించరు. బహిరంగం గా వాటిపై చర్చపై దాదాపు నిషిద్ధం.

కానీ ఆధునిక పోక‌డ‌లు క్ర‌మేపీ కాలంతో పాటు ఆధిప‌త్యం చెలాయి స్తుండ‌డంతో స‌మాజంలో కొంత మార్పు వ‌చ్చింది. కొన్ని క‌ట్టుబాట్ల‌ను ఇప్ప‌టి యువ‌త బొత్తిగా అంగీక‌రిం చ‌డ‌మూ లేదు. స్వేచ్ఛ‌పేరుతో చాలా హ‌డావుడే జ‌రుగుతోంది. కానీ ఢిల్లీ  మెట్రోవారు మ‌రింత  అతిగా వ్య‌వహ‌రించారు. 

ఢిల్లీ మెట్రో కోచ్‌లో మహిళలకు మాత్రమే రిజర్వ్ చేసిన సీట్ల దగ్గర కండోమ్ యాడ్  పోస్టర్  వెలిసింది. కండోమ్ యాడ్ ఇలా బహిరంగంగా పోస్టు చేయడాన్నే చాలా మంది వ్యతిరేకిస్తుంటారు. అదీ మహిళలు మాత్రమే కూర్చునే దగ్గర కనిపించడంతో వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధిం చిన ఫొటో ఒకటి వైరల్ అయింది.

ఓ ట్విట్టర్ యూజర్ ఈ ఫొటోను షేర్ చేస్తూ.. ఢిల్లీ మ‌రీ ఇంత పురోగ‌మించిందా.. అని మండిప‌డ్డాడు. ఇంకొం దరు ట్విట్టర్ యూజర్లకు అదేమీ పెద్ద విషయం కానిదిగా కనిపించింది. అంటే.. ఆ పోస్టర్‌లో తప్పేమిట‌ని ప్రశ్నించారు. ఎవరి అభిప్రాయాలు వారివి. కానీ ఇలాంటి యాడ్స్‌ని ఏమాత్రం ఉత్సాహ‌ ప‌ర్చ‌కూడ‌దు. మ‌రీ ఇలాంటివి మ‌హిళ‌ల‌ను అవ‌మానించిన‌ట్టే అవుతుంద‌ని ప‌రిశీల‌కులు అంటు న్నారు. 

అయితే, పోస్టర్ రభస పై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వర్గాలు బుధవారం స్పందించాయి. ఆ యాడ్ చాలా కాలం నాటిదని, ఇప్పుడు అక్కడ లేదని, ఎప్పుడో తొలగించారని వివరించాయి.