అరేబియా సముద్రంలో వాయుగుండం

 

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం హుదుద్ తుఫానుగా మారి సృష్టించిన గందరగోళాన్ని మరచిపోకముందే ఇప్పుడు అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడింది. ఈ వాయుగుండం తుఫానుగా మారి గుజరాత్‌లో తీరం దాటే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వాయుగుండం కారణంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్, దక్షిణ తెలంగాణ, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాళ్ళు చెప్పినట్టుగానే అనంతపురం జిల్లా బొమ్మన్‌హళ్ళి మండలంలో భారీ వర్షం కురిసింది. పదివేల ఎకరాల వరిపంట నీట మునిగింది. ఇదిలా వుంటే, ఇప్పుడు ఏర్పడిన వాయుగుండం 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం వుంది. ఈ తుఫాను గుజరాత్ వైపు పయనిస్తోంది. ఈ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రమాదమైతే లేదుగానీ, వర్షాలయితే కురిసే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ వాయుగుండం కారణంగా దక్షిణ తెలంగాణలో మబ్బులు కమ్మి వున్నాయి. ఈ వాయుగుండం కారణంగా మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం వుందని తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu