ఏపీ లో అత్యవసరమైతే పోలీస్ పాస్ తీసుకోండి
posted on Apr 25, 2020 8:23PM
రాష్ట్ర ప్రజలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచన
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ–పాస్‌ల జారీకి చర్యలు
జిల్లాల వారీగా పాస్‌ల కోసం వాట్సప్ నెంబర్లు, మెయిల్ ఐడీల వివరాలు విడుదల చేసిన డీజీపీ కార్యాలయం
రాష్ట్రంలో లాక్‌డౌన్ పటిష్టంగా అమలవుతున్న తరుణంలో ఎవరైనా అత్యవసర పనులపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఈ–పాస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. తగిన కారణాలు, ఆధారాలు చూపించి ఈ–పాస్‌కు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని స్పష్టం చేశారు.
దీనికి సంబంధించి డీజీపీ తెలిపిన వివరాలివీ.
► లాక్‌డౌన్ అమల్లో ఉన్న దృష్ట్యా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే వారు ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాంటి వారికి పోలీస్ శాఖ ద్వారా అత్యవసర రవాణా పాస్‌లను జారీ చేస్తాం.
► జిల్లా పరిధిలో వెళ్లాల్సి వస్తే.. ఆ జిల్లా ఎస్పీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. వేరే జిల్లాకు వెళ్లాల్సి వస్తే.. తమ జిల్లా ఎస్పీ ద్వారా ఆ వ్యక్తి వెళ్లాల్సిన జిల్లా ఎస్పీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.
► వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తే.. సదరు వ్యక్తికి సంబంధించిన జిల్లా ఎస్పీ ద్వారా డీఐజీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. వివరాలన్నీ పరిశీలించి ఆయా రాష్ట్రాలను సంప్రదించిన అనంతరం డీఐజీ కార్యాలయం అనుమతి మంజూరు చేస్తుంది.
► పాస్ అవసరమైన వారు చిరునామా, ఆధార్, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనే వివరాలు సమర్పించాలి.
► పాస్ కోసం జిల్లా ఎస్పీల వాట్సాప్, ఈ–మెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తులను పరిశీలించాక వారి మొబైల్ నంబర్లకే పోలీసులు అనుమతులు పంపిస్తారు. ఈ–పాస్ తీసుకున్న వారు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.
ALL UNIT OFFICERS WHATSAPP NUMBERS & Email id'S
S.No
Unit Name
WHATSAPP
Mobile Number
e-mail ID's
1
SRIKAKULAM
6309990933
dail100srikakulam@gmail.com
2
VIZIANAGARAM
9989207326
spofvzm@gmail.com
3
VISAKHAPATNAM RURAL
9440904229
vizagsp@gmail.com
4
VISAKHAPATNAM CITY
9493336633
cpvspc@gmail.com
5
EAST GODAVAI (KAKINADA)
9494933233
sp@eg.appolice.gov.in
6
RAJAHMUNDRY URBAN
9490760794
sp@rjyu.appolice.gov.in
7
WEST GODAVARI
8332959175
policecontrolroomeluruwg@gmail.com
8
KRISHNA (MACHILIPATNAM)
9182990135
sp@kri.appolice.gov.in
9
VIJAYAWADA CITY
7328909090
cp@vza.appolice.gov.in
10
GUNTUR RURAL
9440796184
Dail100gunturrural@gmail.com
11
GUNTUR URBAN
8688831568
guntururbansp@gmail.com
12
PRAKASHAM
9121102109
spongole@gmail.com
13
NELLORE
9440796383
nelloresp@gmail.com
14
CHITTOOR
9440900005
spchittoor@gmail.com
15
TIRUPATHI URBAN
9491074537
sptpturban@gmail.com
16
ANANTHAPURAM
9989819191
spatp1@gmail.com
17
KADAPA
9121100531
spkadapa2014@gmail.com
18
KURNOOL
7777877722
spkurnool.kur@gmail.com
అత్యవసర పనుల కోసం పాస్‌లు తీసుకోదలచినవారు తమ యొక్క వినతిపత్రాలను పైన ఇచ్చిన వాట్సప్ మొబైల్ నెంబర్లకు మరియు మెయిల్ ఐడీలకు మాత్రమే పంపగలరు. అంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్ నెంబర్లకు/మెయిల్ కు అనుమతి పంపబడును. మీరు ప్రయాణించేటపుడు జిల్లాల యొక్క వాట్సప్ నెంబర్ మరియు మెయిల్ ఐడీల నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే అంగీకరించబడును. ఫార్వర్డ్ చేయబడిన అనుమతులు (పాసులు) అంగీకరించబడవు. మీరు ప్రయాణించేటప్పుడు మీతోపాటు మీయొక్క గుర్తింపు కార్డు (ఐడీ కార్డ్) తప్పనిసరిగా ఉంచుకోవాలని డీజీపీ కార్యాలయం పేర్కొంది.