ఏపీకి కేంద్రం 500 కోట్ల సహాయం

 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇప్పటికే ఏపీ అధికారుల దగ్గర నుండి ప్రజల వరకూ ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కేంద్రం నుండి ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది. ఇప్పుడు అది చాలా ఆసక్తికరంగా మారింది.

 

అదేంటంటే ఆంధ్రప్రదేశ్ నూతన రాజదానిలో అసెంబ్లీ, రాజ్‌భవన్ తదితర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి రూ. 500 కోట్లు ఇచ్చేందుకు సముఖత చూపినట్టు తెలుస్తోంది. భవనాల డిజైన్లు, ఇతర వివరాలతో పూర్తిస్థాయి నివేదిక పంపితే వాటిని పరిశీలించి రూ.500 కోట్లు విడుదల చేస్తామని ఆ లేఖలో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ జాబితాలో రాజ్‌భవన్‌, అసెంబ్లీతోపాటు మరో ఒకటి రెండు భవనాలు ఉండే అవకాశముంది.

 

ఈ నేపథ్యంలో ఈ విషయంపై సీఎం చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులతో భేటీ కానున్నారు. అసెంబ్లీ, సచివాలయం, ఉద్యోగుల కార్యలయాలు వారి వసతి గృహాలు తదితర విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.