ప్రతిపక్షనేతను సస్పెండ్ చేయోచ్చా..?

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి మధ్య వాగ్వాదం రోజు రోజుకూ పెరుగుతుందో తప్ప ఏమాత్రం తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. ఇప్పటికే వీరి వాదనలతో అసెంబ్లీ దద్దరిల్లుతోంది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల గురించి మాత్రం ఒక అంశం ఇప్పుడు చర్చాంశనీయమైంది. అదేంటంటే అంబేద్కర్ జయంతి సందర్బంగా ఆయనపై చర్చకు ప్రతిపక్షనేతలు అడ్డుతగులుతుండటంతో స్పీకర్ జగన్ సహా వేసీపీ నేతలందరిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అసలు ప్రతిపక్ష నేతను సస్పెండ్ చేయోచ్చా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అయితే కొంత మంది రాజకీయ నిపుణులు మాత్రం ఇప్పటివరకూ అయితే ఇలాంటి సంఘటన చోటుచేసుకోలేదని అంటున్నారు. మరోవైపు సభలో జరిగిన పరిస్థితి చూస్తే విపక్ష నేతపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం లేదని అంటున్నారు. అంతేకాదు స్పీకర్ కోడెల శివప్రసాద్ విపక్ష నేత వైఎస్ జగన్ పేరును మినహాయించి మిగిలిన వారి చదవటమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలోనూ విపక్ష నేతను సస్పెండ్ చేసిన దాఖలాలు లేవని అంటున్నారు. మరి ఈ విషయంపై అధికార పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu