వల్లభనేని వంశీకి మరో ఎదురు దెబ్బ

కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్దన్ కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేనివంశీకి మరో మారు షాక్ తగిలింది. కస్టడీ ముగియడంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యేను  ప్రత్యేక న్యాయస్థానం ఎస్ సి ఎస్ టి కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారి చేసింది. సత్యవర్దన్ కిడ్నాప్ కేసుతో బాటు టిడిపి కార్యాలయంపై దాడి కేసులో  వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.  న్యాయస్థానం ఆదేశంతో పోలీసులు జైలుకు తరలించారు.