విజయసాయికి జైల్లో పళ్లాలు కడిగే కాంట్రాక్ట్ జాబ్!
posted on Apr 16, 2022 4:39PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన నాయకుల్లో విజయసాయిరెడ్డి ఒకరు. ఆయన ఏం చెప్పాలనుకున్నా.. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆ క్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. దీనిపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. అందుకు ప్రతిగా విజయసాయిరెడ్డికి అనిత ట్విట్టర్ వేదికగా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
విజయసాయిరెడ్డి.. ఆదివారం అంటే ఏప్రిల్ 17వ తేదీన తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఏర్పాట్లను విజయసాయిరెడ్డి స్వయంగా పర్యవేక్షించి.. అందుకు సంబంధించిన ఫొటోలతోపాటు.. ఇంకో 10 నెలల్లో ఎమ్మెల్సీ పదవి కోల్పోతున్న నారా లోకేశ్ కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు... కానీ ఈ జాబ్ మేళలో 72 ఏళ్ల వయస్సు ఉన్న చంద్రబాబుకు జాబ్ ఇవ్వడం కుదరదు.. రిటైర్ కావాల్సిందేనంటూ ఆయన వ్యంగ్యంగా అన్నారు.
దీనిపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత.. ఘాటుగా స్పందించారు. నీ రాజ్యసభ సభ్యత్వం ఇంకో 2 నెలల్లో పొతుందిగా ఏ2? చంచల్ గూడలో పళ్లాలు కడిగే కాంట్రాక్ట్ ఉద్యోగానికి ట్రై చేస్కో.. మా నాయకుడి వయస్సు గురించి మాట్లాడుతున్నావ్.. నువ్వేమన్నా నవయువకుణ్ని అనుకుంటున్నావా ముసలి నక్కా? మా నాయకుడు మిమ్మల్ని అందరిని రిటైర్ చేయించే రోజు త్వరలోనే ఉందంటూ విజయసాయిరెడ్డికి అనిత.. గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.