అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపు.. జనగామలో సంబరాలు!
posted on Nov 8, 2024 5:36AM
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ విజయం పట్ల తెలంగాణ రాష్ట్రంలోని జనగామలో సంబరాలు చేసుకున్నారు. తెలంగాణలోని జనగామ చిల్లా కొన్నె గ్రామంలో ట్రంప్ విజయాన్ని అంబరాన్నంటే సంబరాలతో సెలబ్రేట్ చేసుకున్నారు ఆ గ్రామస్తులు. ట్రంప్ పట్ల తమ అభిమానాన్ని చాటుతూ ఎప్పుడో 2019 లోనే గ్రామంలో ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నా ఆ గ్రామ యువత.. ఇప్పుడు 2024లో ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. గ్రామంలోని ట్రంప్ విగ్రహానికి పూలదండ వేసి, టపాసులు కాల్చి ఘనంగా వేడుక చేసుకున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు 295 ఎలక్టోరల్ ఓట్లు రాగా, కమలాహారిస్‌కు 226 ఓట్లు వచ్చాయి. ట్రంప్ గెలుపొందడంతో ప్రపంచ దేశాధినేతలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. మన దేశంలోనూ కొంతమంది ఆయన గెలుపుతో ఆనందించారు. తెలంగాణలోని జనగామ జిల్లా కొన్నె గ్రామంలో అయితే ట్రంప్ గెలిచినందుకు భారీ సెలబ్రేషన్సే చేశారు. కొన్నె గ్రామంలోని ఆరడుగుల ట్రంప్ విగ్రహానికి విజయ తిలకం దిద్ది, పూల దండలు వేసి ఘనంగా వేడుక చేసుకున్నారు.