"బ్లడ్" డీ సండే

 

"బ్లడీ సండే" ఇలాంటి సండే కూడా ఉంటుందా అని అనుకుంటున్నారా. ఉంటుందండీ. అమెరికా వాళ్లు తలచుకుంటే ఏ డే అయినా ఉంటుంది. అసలు విషయం ఏటంటే 1965లో ప్రజలు ఓటు హక్కు కోసం పోరాటం చేస్తూ సెల్మా నుంచి ఎడ్మండ్ బ్రిడ్జ్ మీదుగా మౌంట్ గోమరీ ప్రాంతం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్నవారిపై ఎడ్మండ్ బ్రిడ్జ్ వద్ద పోలీసులు లాఠీ ఛార్జీలు, బాష్పవాయు ప్రయోగాలు జరిపారు. ఆనాటి రక్తపాతానికి గుర్తుగా అమెరికాలోని ఎడ్మండ్ బ్రిడ్జ్ వద్ద ఆదివారం రోజు వేల సంఖ్యలో స్థానికులు ఒక్కచోట చేరి, ఈ బ్లడీ సండే సంఘటన జరిగి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. వారు సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ, ఆటపాటలతో ర్యాలీ నిర్వహించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu